వక్కంతం  డైరక్షన్ లో ఎన్టీఆర్  !

NTR To Act Under Vakntham Vamsi Direction

01:10 PM ON 19th January, 2016 By Mirchi Vilas

NTR To Act Under Vakntham Vamsi Direction

ఓ పక్క సంక్రాంతికి విడుదలైన 'నాన్నకు ప్రేమతో' చిత్రం భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కురిపిస్తుంటే, ఇక దీని ఫైనల్ రిజల్ట్ పట్టించుకోకుండా ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్టులో ఉత్సాహంగా దూకుతున్నారు. 'జనతా గ్యారేజ్' టైటిల్ తో రూపొందుతున్న కొత్త చిత్రానికి కొరటాల శివ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్నారు. మోహన్ లాల్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ఏ సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ హీరో గా తన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మించే చిత్రం లో జూనియర్ నటిస్తాడని టాక్ నడుస్తోంది. మరి ఈ చిత్రానికి దర్సకుడు ఎవరూ అంటే వక్కంతం వంశీ అనే మాట వినిపిస్తోంది. ఇలా వినిపించడానికి కారణం లేకపోలేదు. వక్కంతం వంశీకు, ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ అందరికీ ఎరుకే. వక్కంతం కు ఎన్టీఆర్.ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చాడట. దాన్ని నిలబెట్టుకోడానికి ఇప్పుడు అవకాశం ఇస్తున్నట్లు ప్రచారం. ఇక ఈ కొత్త చిత్రం నిర్మించడంతో పాటూ, కీలకమైన పాత్ర కూడా కళ్యాణ్ రామ్ పోషిస్తాడని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ఈ చిత్రానికి వచ్చే క్రేజ్ వేరబ్బా అంటున్నారు అప్పుడే....

English summary

Junior NTR to act under the direction of Vakantham Vamsi Direction after The movie with Koratala Shiva. This Movie To Be Produced By Kalyan Ram