కన్నడంలో పాడనున్న యంగ్‌ టైగర్‌

NTR to sing song in kannada movie

03:24 PM ON 18th December, 2015 By Mirchi Vilas

NTR to sing song in kannada movie

నందమూరి వారసుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన నటనతో, డ్యాన్సుల తోనే కాక సింగర్‌ గా కూడా అందరిని ఆకట్టుకున్నాడు. ఇది వరకు ఎన్టీఆర్‌ తను నటించిన యమదొంగ, అదుర్స్‌,రభన వంటి చిత్రాలలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం నాన్నకు ప్రేమతో సినిమాలోను ఒక పాటను పాడినట్టు సమాచారం.

ఇప్పుడు ఎన్టీఆర్‌ తెలుగులోనే కాక ఒక కన్నడ సినిమాలో కూడా పాట పాడబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్‌ స్నేహితుడైన ఎన్‌.కె. లోహిత్‌ నిర్మాతగా మారి కన్నడంలో చక్రవ్యూహ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో భాగంగా పునీత్‌ పై చిత్రికరించె ఒక పాటను ఎన్టీఆర్‌తో పాడించి ఈ సినిమాకు మంచి క్రేజ్‌ తీసుకురావలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇలా ఒక్క తెలుగులోనే కాక కన్నడ భాషలోను పాట పాడడం ఎన్టీఆర్‌ ఇదే తొలిసారి కావడం విశేషం.

English summary

Tollywood hero young tiger NTR to sing a song in Kannada movie chakravyuh in which the hero in the film was kannada power star Puneeth Rajkumar