ఎన్టీఆర్‌ తరువాత సినిమా పోస్టర్‌ వచ్చేసింది

NTR upcoming movie poster released

11:46 AM ON 20th May, 2016 By Mirchi Vilas

NTR upcoming movie poster released

నాన్నకుప్రేమతో చిత్రంలో కొత్త లుక్‌తో అదరగొట్టిన ఎన్టీఆర్‌ జనతాగ్యారేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ తర్వాత చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అయితే ఎన్టీఆర్‌ తర్వాత చిత్రాన్ని వక్కంతం వంశీ రచయితగా వ్యవహరించనున్నారు. చాలా రోజులుగా వాయిదా అయిన ఈ సినిమా చివరికి ఫిక్స్‌ అయింది. ఈ సినిమాని కళ్యాణ్‌రామ్‌ తన బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై నిర్మించనున్నారు. ఎన్టీఆర్‌ పుట్టిన రోజున ఈ పోస్టర్‌ని కళ్యాణ్‌రామ్‌ ట్వీట్‌ చేసారు.

ఇది కుడా చూడండి :'జనతా గ్యారేజ్' లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అదిరిపోయిందిగా

ఎన్టీఆర్‌ వంశీతో కథ సిద్దం చేయమని చెప్పారట. ప్రస్తుతం వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ రెడీ చేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. రచయితగా ఉన్న వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నాడు. చిత్ర షూటింగ్‌ సెప్టెంబర్‌లో మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎన్టీఆర్‌ తరువాత చిత్రం ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కనుంది. జనతాగ్యారేజ్‌ చిత్రం ఆగష్టులో రిలీజ్‌ అవనుంది.

ఇది కుడా చూడండి :ఎస్.జే. సూర్య సినిమాకి పవన్ తీసుకుంటున్న పారితోషకం ఎంతో

ఎన్టీఆర్‌ నటించిన అశోక్‌, ఊసరవెల్లి, టెంపర్‌ సినిమాలకు వంశీ రచయితగా వ్యవహరించారు. ఇప్పుడు వంశీ స్వచాంగా దర్శకత్వం వహించనున్నారు. అందుకోసం ఎన్టీఆర్‌కి సరిపడే స్క్రిప్ట్‌ సిద్దం చేయాలని కుస్తీలు పడుతున్నట్లు సమాచారం.

ఇది కుడా చూడండి :రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతోనేనా?

పూరి దర్శకత్వంలో టెంపర్‌ 2 సినిమాను చేయడానికి ఒప్పుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఆ చిత్రాన్ని పక్కన పెట్టి వంశీ సినిమాను సెట్స్‌ మీదకు తీసుకురావడానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్‌ది బెస్ట్‌ వంశీ.

English summary

NTR upcoming movie poster released.