'ఎన్టీఆర్‌' బాలీవుడ్‌ బ్యూటీతో రొమాన్స్ చేస్తాడా?

Ntr want to romance with Shraddha Kapoor

12:00 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Ntr want to romance with Shraddha Kapoor

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 25వ చిత్రం 'నాన్నకు ప్రేమతో'. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇది అయిపోయిన వెంటనే ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'జనతా' గ్యారేజ్‌' అనే టైటిల్‌ ను కూడా ఫిక్స్‌ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ముహూర్తపు సన్నివేశాలు కూడా జరిపేశారు. అయితే ఇందులో ఎన్టీఆర్‌ సరసన బాలీవుడ్‌ భామ శ్రద్ధాకపూర్‌ ని నటింపచేయాలని అనుకున్నది వాస్తవమేనట. అందుకోసం శ్రద్ధాకపూర్‌ని కలిసి మాట్లాడం కూడా జరిగింది.

మైత్రీ మూవీస్‌ పతాకాం పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించాడానికి శ్రద్ధాకపూర్‌ ఏకంగా 3.5 కోట్లు భారీ పారితోషకం అడిగిందట. దీనితో నిర్మాతలు వెనుకడుగు వేశారని సమాచారం. బాలీవుడ్‌లోనే ఇంతకంటే తక్కువ రేటుకి ఎవరైనా వస్తారేమో అని ప్రయత్నిస్తున్నారట నిర్మాతలు. మరి ఫైనల్‌గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి.

English summary

Ntr want to romance with Shraddha Kapoor in Janatha Garrage.