ఆంధ్రాలో జనాభా కన్నా మొబైల్స్ ఎక్కువట

Number of Mobile phones more than people in A.P

10:40 AM ON 22nd August, 2016 By Mirchi Vilas

Number of Mobile phones more than people in A.P

ఒకప్పుడు ఫోన్ స్టేటస్ సింబల్. ఫోన్ బుక్ చేస్తే, సంవత్సరాల కొద్దీ వెయిట్ చేసే పరిస్థితి. కానీ సాంకేతిక విప్లవం, మొబైల్ విప్లవం కారణంగా ప్రతి ఒక్కరికి ఫోన్ అందుబాటులో కొచ్చేసింది. మామూలు ఫోన్లే కాదు స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒక ఇంట్లో ఇంచుమించు అందరికీ మొబైల్స్ వున్నాయి. ఒక్కరికి రెండేసి మూడేసి మొబైల్స్ వున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ లో జనాభా కంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వున్నాయట.

రాష్ట్ర జనాభా 4.95 కోట్లు కాగా.. మొబైల్ కనెక్షన్లు మాత్రం 7.48 కోట్లగా ఉన్నట్టు తేలింది. అర్బన్, సెమీ అర్బన్ గా రూపుదిద్దుకుంటున్న ప్రాంతాల్లో మొబైల్ కనెక్షన్ల సంఖ్య బాగా పెరిగినట్టు నిపుణులు చెబుతున్నమాట. తక్కువ ధరల్లో డేటా ప్యాక్ అందుబాటులో ఉండడం, ఇంటర్నెట్ కోసం స్టూడెంట్స్ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు తీసుకోవడం, కొందరైతే రెండేసి మొబైళ్లను వినియోగించడం, దీనికితోడు ఎక్కువ ఫీచర్లున్న మొబైల్ ఫోన్లు తక్కువ ధరకు సామాన్యులకు అందుబాటులోకి రావడం ఒకటైతే, సిమ్ కార్డులు తక్కువ ధరకు లభించడం, ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని వినియోగించుకునే వీలుండడం కూడా కారణాలుగా భావిస్తున్నారు.

ఇక బీఎస్ఎన్ఎల్ తమ సేవలను మరింతగా విస్తరించడంతో రూరల్ మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలకు కూడా మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చేశాయి. ఇక వైజాగ్ ఏజెన్సీలో అయితే నక్సల్స్ కూడా సెల్ ఫోన్ సేవల్ని వినియోగించుకుంటున్నట్లు పోలీసులు అధికారులు చెబుతున్నారు.

ఇందులోభాగంగా జనాభా కంటే మొబైల్ కనెక్షన్లు పెరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్లకు పెద్ద మార్కెట్ అయిన ఇండియాలో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1,026 మిలియన్లకు చేరింది. అత్యధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ మొబైల్ కనెక్షన్ల విషయంలో ఫస్ట్ ప్లేస్ లో నిలవగా మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్ తర్వాత స్థానంలో నిలిచాయి.

ఇది కూడా చూడండి: టాలీవుడ్ హీరో ల పారితోషికాలు!!

ఇది కూడా చూడండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చూడండి: మీ రాశి ప్రకారం ఎ కెరీర్ లో బాగా రాణిస్తారు

English summary

Number of Mobile phones more than people in Andhra Pradesh.