నగ్నంగా డాన్స్ చేయలేదని ఆమెతో స్పిరిట్ తాగించారు

Nursing college student ragged by seniors

01:41 PM ON 23rd June, 2016 By Mirchi Vilas

Nursing college student ragged by seniors

అకృత్యాలు , అన్యాయాలు , దుర్మార్గాలు , అత్యాచారాలు పెరుగుతున్నాయి. నగ్నంగా నృత్యం చేయడానికి నిరాకరించిందన్న కారణంగా ఓ విద్యార్థినితో తోటి విద్యార్థినులు బాత్రూమ్ లు కడిగే స్పిరిట్ ని తాగించారు. అక్కడితో ఆగలేదు ... ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసి పదేపదే చూస్తూ వికృతానందం పొందారు. అంతేకాదు, ఆమెకు ఆస్పత్రిలో వైద్యం అందకుండా అడ్డుకొన్నారు. ఇంత కర్కశంగా వ్యవహరించిన ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గిలోని కర్ణాటక నర్సింగ్ కాలేజీలో ఇటీవలే వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమెకు కేరళలోని కోజికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

కేరళలోని త్రిశూర్ జిల్లా ఇడప్పల్ ప్రాంతానికి చెందిన బాధితురాలు (19) చిన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. తల్లి కూలిపనులు చేసి సంపాదించిన డబ్బులతో చదువుకొంటోంది. ఇటీవలే కర్ణాటకలోని నర్సింగ్ కాలేజీలో చేరింది. రెండు రోజుల క్రితం ఆమెను సీనియర్ విద్యార్థినులు కాలేజీలో అటకాయించారు. ర్యాగింగ్ పేరిట దారుణంగా అవమానించారు. బట్టలు విప్పేసి నగ్నంగా తమ ఎదుట ఆడిపాడాలని ఒత్తిడి తెచ్చారు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు. నేలపైకి నెట్టి చేతులు కాళ్లు బంధించారు. బాత్రూమ్ లు కడిగే స్పిరిట్ ని బలవంతంగా తాగించారు. అంతేకాదు, ఆ దృశ్యాలను మొబైల్ లో బంధించి సర్క్యులేట్ చేశారు. స్పిరిట్ గొంతులో పడగానే బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న విద్యార్థులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదవుతాయనే కారణంగా.. కొంతమంది వైద్య విద్యార్థులు ఆస్పత్రి వర్గాలపై దౌర్జాన్యానికి పాల్పడ్డారు. ఆమె వస్తువులను బయట పడేసి, ఆస్పత్రి నుంచి గెంటేశారు. ఇంతిలా జరిగితే, కాలేజీ యాజమాన్యం కూడా ఆమె పట్ల జాలి చూపించలేదు. పైగా ర్యాగింగ్ ను.. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కొద్దిమంది సహాయంతో బాధితురాలు ఎలాగోలా బుధవారం కేరళ చేరుకొంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని కోజికోడ్ లోని మెడికల్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో కేరళకు చెందిన ఎనిమిది మంది విద్యార్థినులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు.

ఇది కూడా చూడండి:వాట్సప్ లో ఈ ఫీచర్స్ మీకు తెలుసా

ఇది కూడా చూడండి:చేతబడిలో నిమ్మకాయలు ఎందుకు వాడతారో తెలిస్తే భయపడి తీరాల్సిందే

ఇది కూడా చూడండి:మరణానికి ముందు యమధర్మరాజు పంపే 4 సూచనలు ఇవే

English summary

Nursing college student ragged by seniors. She was admitted to Kozhikode hospital after ragging.