ఆటోలోనే గ్యాంగ్ రేప్

Nursing Student Gang Rape In Kerala

12:11 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Nursing Student Gang Rape In Kerala

ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని చర్యలు తీసుకున్నా, నిర్భయ తరహా గ్యాంగ్ రేప్ మరోటి జరిగిపోయింది. ఇటీవల ఎర్నాకుళం జిల్లాలో న్యాయ విద్యార్థిని పై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన కేరళ రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఘటన ఇంకా చెరిగిపోకముందే, మరో ఘాతుకం చోటుచేసుకుంది. ఒక దళిత నర్సింగ్ విద్యార్థినిపై ఆటోలోనే సామూహిక అత్యాచారం జరిగింది. విద్యార్థిని ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు మంగళవారం రాత్రి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే,

ఇవి కూడా చదవండి:మన పాపాలు గంగలో కలిస్తే ఆ పాపాలు ఎక్కడికి పోతాయి?

బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని తనకు తెలిసిన ఆటో రిక్షాలో కాలేజీకి బయలుదేరింది. మార్గమధ్యంలో డ్రైవర్‌కు తెలిసిన మరో ఇద్దరు ఆటో ఎక్కారు. అనతరం వారు వర్కాలలోని అవంతి బ్రిడ్జి సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన విద్యార్థినికి ఫిట్స్ కూడా వచ్చాయి. సహాయం కోరుతూ ఆమె ఆక్రందన చేయడంతో కొందరు వ్యక్తులు అక్కడకు చేరుకుని ఆమెను తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:అతన్ని చూసి పారిపోయిన హీరోయిన్

ఇవి కూడా చదవండి:ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

English summary

A 19 Year Old Nursing Student was raped in Auto in Ernakulam in Kerala State. Police filed case on this incident and arrested them and filed cases on them. So many people there were demanded to Punish the accused persons severely.