వామ్మో .. వేలంలో 3 టికెట్లు.. రూ.36 లక్షలట

O my god ! the cost of three tickets is 36 Lakhs

10:44 AM ON 11th January, 2017 By Mirchi Vilas

O my god ! the cost of three tickets is 36 Lakhs

అభిమానం ఉంటే ఏపని చేయడానికైనా వెనుకాడరు. ఇక సినీ అభిమానం అంటే మరీను. అందునా మెగా అభిమానులంటే ఇక చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో చేరిన తర్వాత సినీ రంగానికి దూరంగా వున్నా మెగాస్టార్ చిరంజీవి 9ఏళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అభిమానులను ఉత్తేజపరుస్తూ చిరంజీవి తన 150వ సినిమాను ప్రకటించాడు.. తీశాడు.. తాజాగా ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా చిరంజీవికే కాదు.. తన అభిమానులకూ ప్రత్యేకం, ప్రతిష్ఠాత్మకమే. సినీ పరిశ్రమలో సంచలనమే. సర్వత్రా చర్చగా మరీనా చిరు సినిమా విడుదల ఎప్పుడెప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ఆ ఘడియలు రానే వచ్చాయి. అందుకే రాక..రాక పదేళ్ల గ్యాప్ తర్వాత వస్తుండడంతో ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. తొలిరోజు తొలి షో చూసి తీరాల్సిందే అన్న పట్టుదలతో మెగా అభిమానులు ఉన్నారు . అందుకు నిదర్శనం బెంగళూరులో జరిగిన ఓ ఘటనే. ఓ థియేటర్లో 3 ఖైదీ టికెట్లను వేలం వేస్తే.. ఓ చిరు అభిమాని రూ.36 లక్షలకు దక్కించుకున్నాడట. ఇక, ఆ వేలంలో వచ్చిన డబ్బును చిరంజీవి పేరిట బెంగళూరులోని ఓ అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాలని థియేటర్ యాజమాన్యం భావిస్తోందట. అంతేగాకుండా.. ఇటు స్పెషల్ షో టికెట్ ధరలూ ఆకాశాన్ని అంటుతున్నాయట. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఖైదీకి భారీ స్పెషల్ షోలు ప్లాన్ చేస్తున్నారని టాక్. టికెట్ ధరలు రూ.500 నుంచి రూ.1500 దాకా పలుకుతున్నాయట. డైరెక్ట్ గా తీసుకుంటే ఉన్న పరిస్థితి అది. అదే బ్లాక్ మార్కెట్ లో అయితే డిమాండ్ ను బట్టి రూ.2500 నుంచి ఆపైన పలుకుతున్నాయని చెబుతున్నారు. మొత్తానికి మెగా రీ ఎంట్రీ మెగా రికార్డు క్రేయేట్ చేస్తుందా లేదా చూడాలని అంటున్నారు సినీ జనాలు

ఇది కూడా చూడనాడే : గ‌ర్భిణీ స్త్రీలు బంగారం ధరిస్తే అలా అవుతుందా?

ఇది కూడా చూడనాడే : దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి ... షాకింగ్ వీడియో

ఇది కూడా చూడనాడే : ఐష్ డాటర్ - ఆమిర్ సన్ రఫ్ ఆడించారు(వీడియోలు)

English summary

Every one is very excitedly waiting fro Cheeranjeevi new movie after 10years gap this is the first movie of Cheeranjeevi. In Bangalore Cheeranjeevi fan purchased three movie tickets for 36 lakhs