అగ్రరాజ్య నేత  కంటనీరు 

Obama Cried In An Event

01:24 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Obama Cried In An Event

ప్రపంచాన్ని శాసించే అమెరికా కు అధ్యక్షుడు కంట నీరు పెట్టడమా... ఎడతెగని సమస్య వస్తే, చెప్పుకోలేని కష్టం వస్తే , మదిని దోలిచే పరిణామాలు వెంతాడితే, గుండె బరువెక్కి, కన్నీళ్లు రాకమానవు ఎవరికైనా. దీనికి అగ్ర రాజ్య నేత అయినా ఎవరైనా మినహాయింపు కానే కాదు. అందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన దేశంలో పిల్లల్లో సైతం గన్ కల్చర్ పెరిగిపోవడం ఆవేదన చెందుతూ, ఉండబట్టలేక ఏకంగా కన్నీరు పెట్టేసారు.

మూడేళ్ల క్రితం కనెక్టికట్ 20మంది ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను ముష్కరులు తుపాకీ గుళ్లకు బలి చేసిన విషయాన్ని శ్వేతసౌధం కార్యక్రమంలో ఆయన గుర్తు చేసుకుని ఏడ్చేశారు. ఆ చిన్నారులు గుర్తుకు వచ్చిన ప్రతిసారీ తాను పిచ్చివాడినై పోతున్నట్లు చెప్పారు. చెక్కిళ్లపై నుంచి కన్నీరు కారుతుండగా తుపాకుల వినియోగాన్ని, తుపాకీ హింసను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ముందుకు వెళ్లాల్సిందిగా కాంగ్రెసును డిమాండ్ చేయాలన్నారు.

English summary

American President Barack Obama cries in an event in which was held on america. He worried about the increasing the gun culture in america