సినిమాల్లో ఒబామా బిగ్ డాటర్

Obama Daughter Malia To Act In Movies

01:48 PM ON 11th June, 2016 By Mirchi Vilas

Obama Daughter Malia To Act In Movies

రాజకీయ నేతలు సినిమాల్లోకి రావడం, సినిమా వాళ్ళు రాజకీయాల్లో కాలుమోపడం కొత్తేం కాదు. అమెరికాలోనైనా ఇంతే మరి. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, అమెరికా అధ్యక్షుడు ఒబామా డాటర్ ఇప్పుడు సినిమాల్లో నటించబోతోంది. అవును నిజం ... ఒబామాకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు మాలియ, చిన్న కుమార్తె సషా వున్నారు. 17 సంవత్సరాల బిగ్ డాటర్ మాలియ సిడ్వెల్ ఫ్రెండ్స్ అనే ప్రవేట్ హైస్కూల్ లో తన డిప్లమోను పూర్తి చేసుకుంది. దీంతో తన కాలేజ్ ను హార్వర్డ్ యూనివర్శిటీలో కొనసాగించనుంది. అయితే ఈలోపు మధ్యలో ఒక ఏడాది పాటు చదువుకు విరామం ఇవ్వనుందట. ఇందుకు కారణాలను మాత్రం తండ్రి ఒబామా గాని, తల్లి మిచ్చెల్లి ఒబామా గాని వెల్లడించలేదు. అయితే పెద్ద కూతురు మాలియా ఫిల్మ్ మేకర్ కావాలని కోరుకుంటుందని ప్రధమ మహిళ మిచ్చెల్లి ఒబామా చెప్పారు. దీంతో ఈ గ్యాప్ లో మూవీలకు సంబంధించిన పనులు ఏమైనా చేయనుందేమోననే ఊహాగానాలు నడుస్తున్నాయి. పలు దేశాలు తిరిగిన మాలాయాకు చాలా మంది ప్రముఖులు పరిచయమున్నారు. స్కూల్లో సాకర్, టెన్నీస్ వంటి ఆటలను బాగా ఆడేది. ఫ్లూట్, పియానో వాయించడం వచ్చు. తన పనులు తానే చేసుకుంటుందని రూమ్ ను తానే శుభ్రం చేసుకోవడం, దుస్తులు ఇస్త్రీ చేసుకోవడం చేస్తుందని తల్లి చెబుతోంది. జులై 4న 18వ ఏటలోకి అడుగు పెట్టబోతున్న మాలియా తన తండ్రి తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కు మొదటి ఓటును వేస్తుందంట. మొత్తానికి ఒబామా డాటర్ సినీ రంగంలో ఎలాంటి సంచలనం సృష్టించనుందో.

ఇవి కూడా చదవండి:ఫేస్ బుక్ లో తెలియని అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తున్నారా..అయితే ఒక్క నిమిషం ఆగండి

ఇవి కూడా చదవండి:ప్రేయసి కేకలతో ప్రియుడి పై పోలీసులు బుల్లెట్ల వర్షం(వీడియో)

English summary

American President Obama's First Daughter Malia was going to act in Hollywood Movies.