మా పార్టీ అభ్యర్థికైనా ఓటేయను: ఒబామా

Obama Did Not Vote To His Party Member

04:40 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Obama Did Not Vote To His Party Member

గన్ కల్చర్‌పై కలత చెందుతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా,ఈ సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకించేవారికి మద్దతిచ్చేది లేదని స్పష్టం చేశారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో అటువంటివారి తరపున ప్రచారం చేయబోనని, వారు డెమొక్రాట్ అభ్యర్థులైనప్పటికీ ఓటు కూడా వేయబోనని ప్రకటించారు. తుపాకుల అమ్మకాలు, కొనుగోళ్లను క్రమబద్ధీకరించే ఏకపక్ష చర్యలకు మద్దతు కూడగట్టేందుకు ఆయన టెలివిజన్‌ను ఆశ్రయించారు. గన్ కల్చర్ సంస్కరణలను అమెరికన్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తన ప్రతిపాదనలను విమర్శకులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఒబామా అన్నారు. ఆయుధాలు ధరించేందుకు ఉన్న హక్కును రద్దు చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇదంతా కుట్ర ప్రకారం జరుగుతోందని విమర్శించారు.

English summary

American president Obama says that he will did not vote to his party members who supports gun culture in US