నా పని అయిపోయిందన్న ఒబామా

Obama Dinner To Celebrities In White House

12:23 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Obama Dinner To Celebrities In White House

అవునా,అగ్ర రాజ్యాధినేత అలా అనడమేమిటి అనుకుంటున్నారా? నిజంగా ఆయన నోటినుంచి వచ్చిన వ్యాఖ్యలే ఇవి.ఎందుకన్నారంటే,రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, మీడియా ప్రముఖులకు వైట్‌ హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా డిన్నర్‌ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల కోసం ఒవైపు జోరుగా ప్రచారం జరుగుతుంటే.. ఒబామా జోకులు వేస్తూ అందరినీ నవ్వించారు. డిన్నర్‌ను డాక్టర్‌ ఈవెంట్‌గా ఆయన అభివర్ణించారు.‘ఒబామా పని ఇక అయిపోయింది’ అంటూ తన మీద తానే జోకులు వేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:చిన్నప్పుడు తీసుకున్న పుస్తకాన్ని అమ్మమ్మయ్యాక ఇచ్చింది

వచ్చే ఏడాది ఈ సమయానికి ఇక్కడ వేరొక అధ్యక్షులు ఉంటారని, ఆమె ఎవరో మీరు ఊహించుకోవచ్చునని హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశించి అన్నారు.ఎనిమిదేళ్ల క్రితం నేను యువనేతను, ఎంతో కసిగా ఉండేవాడిని, ఇప్పుడు ముసలివాడినైపోయానని వ్యాఖ్యానించారు.జుట్టు నెరిసిందని, పదవి ఎప్పుడు ముగిసిపోతుందా అంటూ రోజులు లెక్కపెట్టుకుంటున్నానని ఆయన అనడంతో అందరూ నవ్వుల్లో మునిగి తేలారు.

ఇవి కూడా చదవండి:ఆమెకు మొత్తం 69 మంది పిల్లలు

ఇవి కూడా చదవండి:అక్కడ అమ్మాయిలు చదువుకోవాలంటే వ్యభిచారం చెయ్యాల్సిందే!

English summary

America President Obama gave dinner to Celebrities ,Journalists and many others in White House. He says that by the next year another person will be there in his place.He also played some jokes on him.