వచ్చే ఏడాది అమెరికాలో మోడీ, షరీఫ్ భేటీ

Obama invites PM Narendra Modi and Pakistan PM Sharif

04:47 PM ON 29th December, 2015 By Mirchi Vilas

Obama invites PM Narendra Modi and Pakistan PM Sharif

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌తో భేటీ కానున్నారు. ఇటీవల ప్రధాని మోడీ పాకిస్థాన్ లో ఆకస్మికంగా పర్యటించిన సంగతి తెలిసిందే.

కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరిగిన ప్రపంచ వాతావరణ సదస్సు సందర్భంగానూ షరీఫ్ తో మోదీ భేటీ అయిన సంగతి విదితమే. ఈ పర్యటనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు నాటకీయ ములుపు తిరిగాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది మార్చి 31, ఏప్రిల్‌ 1 తేదీల్లో అణు భద్రతపై బహుళపక్ష శిఖరాగ్ర సదస్సుకు రావాలని అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా వీరికి ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో ప్రధానులిద్దరూ వాషింగ్టన్‌లో సమావేశమయ్యే అవకాశాలున్నాయి.

English summary

US President Barack Obama has invited Prime Minister Narendra Modi and Nawaz Sharif from Pakistan to attend Washington next year.