అడవిబాటపట్టిన ఒబామా

Obama On Bear Grills Wild Show

06:57 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Obama On Bear Grills Wild Show

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అడవిబాటపట్టారు. ఆటవిక మనిషిగామారిన మంచుకొండల్లో చక్కర్లు కొట్టారు. ఇదంతా ఎందుకోసం అనుకుంటున్నారా.. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒబామా కొంచెం కొత్తగా ప్రయత్నించారు. ప్రఖ్యాత టీవీ హోస్ట్ బియర్ గ్రిల్స్‌తో జరిగిన వైల్డ్ షోలో ఒబామా పర్యావరణంపై అనేక అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. గత సెప్టెంబర్‌లో షూటింగ్ జరిగిన ఆ షో అమెరికా ఎన్‌బీసీ ఛానల్‌లో ప్రసారం అయ్యింది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ హోస్ట్ ఎడ్వర్డ్ మైఖేల్ బియర్ గ్రిల్స్ ప్రస్తుతం ఎన్‌బీసీ ఛానల్‌లో రన్నింగ్ వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాడు. ఆ షోకు బరాక్ ఒబామాను అతిథిగా ఆహ్వానించారు. అలస్కాలో ఓ ఎపిసోడ్‌ను షూట్ చేశారు. గ్లేసియర్ల అందాల మధ్య ఆ షో సాగింది. ఓ ఎలుగుబంటి సగం తిని వదిలేసిన ఓ పచ్చి సాల్మన్ చేప ముక్కను బియర్ గ్రిల్స్ మంటల్లో కాల్చి ఒబామాతో తినిపించారు. అమెరికా అధ్యక్షుడు కూడా దాన్ని ఆనందంగా ఆస్వాదించారు. కానీ తన మూత్రాన్ని తానే తాగేందుకు మాత్రం నిరాకరించారు. ప్రతికూల పరిస్థితుల్లో చావే మార్గమైనప్పుడు ఆ చర్యకు పాల్పడుతానన్నారు.

/p>

English summary

America President Obama has participated in Bear Grills Survival Tv Show "Running Wild Bear Grills" program which is going to be telecasted on NBC channel