గన్ కల్చర్ నియంత్రణకు ప్రత్యేక అధికారాలు: ఒబామా

Obama to impose new gun controls next week

07:29 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Obama to impose new gun controls next week

అమెరికాను పట్టిపీడిస్తున్న గన్ కల్చర్ కు ముగింపు పలికేందుకు ఆ దేశాధ్యక్షుడు ఒబామా సిద్ధమయ్యారు. దేశంలో ఆయుధ హింసను తగ్గించేందుకు ఏకపక్ష నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. తాను తీసుకోబోయే చర్యల గురించి అటార్నీ జనరల్ లోరెట్టా లించ్‌తో చర్చించనున్నట్లు ఒబామా తన నూతన సంవత్సర సందేశంలో పేర్కొన్నారు. ఆయుధ హింసపై నిర్ణయం తీసుకోవడంలో పార్లమెంట్ విఫలమైన కారణంగా ప్రత్యేక అధికారాలను వినియోగించుకోవాలని ఒబామా భావిస్తున్నారు. ఒబామా నిర్ణయం వల్ల ఆయుధ మద్దతుదారులు, రిపబ్లికన్ల నుంచి విమర్శలు తప్పవని నిపుణులు అంటున్నారు. ప్రతి హింసాత్మక ఘటనను అడ్డుకోవడం కష్టమే, కానీ ఒక్క దాన్నైనా ఆపితే బాగుంటుందని, పిల్లల భవిష్యత్తు కోసం పార్లమెంట్ సభ్యులు గన్ కంట్రోల్ చట్టాన్ని తీసుకువస్తే నష్టం ఏం జరుగుతుందని ఒబామా ప్రశ్నించారు. ఆయుధ నియంత్రణ కోసం తాను తీసుకున్న నిర్ణయాలకు ఎంపీల నుంచి మద్దతు లభించలేదన్న విషయం వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఆయుధాలు ఖరీదు చేయాలనుకునే కస్టమర్ల పూర్వ విషయాలను లోతుగా ఆరా తీసేందుకు ఒబామా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అమెరికన్లను నిరాయుధుల్ని చేస్తే.. మరో విప్లవం రాక తప్పదని టెక్సాస్ పోలీస్ అధికారి ఒకరు దేశాధ్యక్షుడిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఒబామా ప్రయత్నాలకు గండి పడే ఛాన్సుంది.

English summary

President Barack Obama will press ahead with a set of executive actions on guns next week despite growing terror concerns in the US that have dampened some Americans' enthusiasm for tighter fire arms restrictions.