అంతం చేస్తాం.. ఐఎస్ కు ఒబామా స్ట్రాంగ్ వార్నింగ్

Obama Warning To ISIS

05:23 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Obama Warning To ISIS

ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థను అంతం చేయడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి హెచ్చరించారు. తమ తదుపరి లక్ష్యం ఐఎస్ నాయకులేనని, ఎక్కడున్నా వారిని హతమారుస్తామని ప్రకటించారు. కాలిఫోర్నియాలో దాడి అనంతరం ఒబామా రెండోసారి సోమవారం ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాక్, సిరియాలో ఉన్న ఐఎస్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు అమెరికా, మిత్రదేశాలు కలసికట్టుగా పోరాడుతాయని చెప్పారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోరాటాన్ని ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. ఐఎస్ నాయకులు ఎక్కడా తలదాచుకోలేరని, తాము ఐఎస్ నాయకులకు పంపే సందేశం ఒక్కటేనని. తమ టార్గెట్ వారేనని ఒబామా పేర్కొన్నారు. కాలిఫోర్నియా దుర్ఘటన అనంతరం ఒబామా ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని ఒబామా ప్రకటించిన విషయం విదితమే.

English summary

US president Obama had given a severe warning to ISIS terrorist group. He says that his main target was to end ISIS terrorists group in the world