హిల్లరీకి ఒబామా తోడు - ప్రచారంలోకి దూకుతున్నారట

Obama will campaign for Hillary

03:07 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Obama will campaign for Hillary

అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు మరింత ఊపందుకున్నాయి. ప్రచారం హోరెత్తుతోంది. ఇక డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరఫున ఆ దేశాధ్యక్షుడు ఒబామా ప్రచారం చేయడానికి రంగంలోకి వస్తున్నారు. ఒబామాతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జోయ్ బిడెన్ కూడా ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు.

జులై 5న ఉత్తర కరోలినా, ఛార్లొట్టేలో నిర్వహించనున్న హిల్లరీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ర్యాలీకి ఒబామా, బిడెన్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా దేశ పురోగతికి గురించి ఒబామాతో చర్చించనున్నట్లు ఇటీవల హిల్లరీ ఓ ప్రకటనలో విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నట్లు హిల్లరీ ప్రకటించిన తర్వాత.. ఒబామా ఆమెకు మద్దతుగా ప్రచారం చేపట్టడం ఇదే తొలిసారి.

ఈ ఏడాది చివర్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ , రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. వీరిద్దరూ అధ్యక్ష పదవి కోసం ఇప్పటి నుంచే తమదైన శైలిలో ప్రచారాలు మొదలుపెట్టారు. హిల్లరీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఉపాధ్యక్షుడు బిడెన్ పూర్తి మద్దతు ప్రకటించారు. కాగా.. ఓపీనియన్ పోల్స్ లో ట్రంప్ కంటే క్లింటన్ .. ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఈ వ్యూహాన్ని ట్రంప్ ఎలా ఎదుర్కొంటాడా మరి..

ఇది కూడా చూడండి: ఇంట్లో ఉంచకూడని 8 పెయింటింగ్స్

ఇది కూడా చూడండి: నిమిషానికి క్రికెటర్ల సంపాదన తెలిస్తే షాకే

ఇది కూడా చూడండి: దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

English summary

Obama will campaign for Hillary. America President Barack Obama will appear next week with Clinton.