పరిటాల నిజమైన హీరో అంటున్న ఒబెరాయ్ 

Oberoi commented on paritala

12:35 PM ON 13th January, 2016 By Mirchi Vilas

Oberoi commented on paritala

దివంగత పరిటాల రవి పాత్ర వెండి తెరపై పోషించి, మెప్పించిన బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్ నిజ జీవితంలో కూడా పరిటాలతో అనుబంధం పెనవేసుకున్నారు. ఇది యాదృచ్చికమో, ఏమో పరిటాల కుటుంబం, అభిమానులు కూడా ఒబెరాయ్ ని అభిమానిస్తున్నారు. అందుకే నీరాజనం పడుతున్నారు. వివరాల్లోకి వెళితే, నీ పరిటాల జిల్లా అయిన అనంతపురం జిల్లా ముత్తవకుంట్ల గ్రామాన్నిఒబెరాయ్ దత్తత తీసుకున్నారు. దేశంలోనే ఆదర్శగ్రామంగా ఈ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని వివేక్‌ ఒబెరాయ్‌ అంటున్నారు. మంగళవారం అనంతపురం జిల్లా కనగానపల్లి మండలంలోని ముత్తవకుంట్ల గ్రామానికి హీరో వివేక్‌ ఒబెరాయ్‌ రావడంతో ఆయనతో కల్సి మంత్రి పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, జేసీ లక్ష్మీకాంతం పర్యటించారు. వీరికి గ్రామ సర్పంచి, ఎంపీటీసీ, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు చేశారు. అనంతరం స్మార్ట్‌ విలేజ్‌ -స్మార్ట్‌ గ్రామంలో భాగంగా చైతన్యసభ ఏర్పాటుచేశారు. కాగా, వివేక్‌ఒబెరాయ్‌ ఇంగ్లీష్‌లో మాట్లాడిన మాటలను పరిటాల శ్రీరామ్‌ తెలుగులో అనువదించారు.

వివేక్‌ఒబెరాయ్‌ మాట్లాడుతూ పరిటాల రవీంద్ర నిజమైన హీరో అన్నారు. శ్రీహరిపురం పేరుతో 140 ఇళ్లు నిర్మించిన ఘనత అయనకే ఉందన్నారు. పరిటాల రవీంద్ర స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ చేస్తున్నట్లు చెప్పారు. ఆయన జ్ఞాపకార్థంగా ముత్తవకుంట్ల గ్రామాన్ని దత్తకు తీసుకున్నానన్నారు. ముత్తవకుంట్ల గ్రామ ప్రజలు చాలా తెలివైన వారని, ఈ గ్రామాన్ని స్మార్ట్ గ్రామంగా తీర్చిదిద్దడం కష్టమైన పనికాదన్నారు. విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడానికి కంప్యూటర్లు, నీటిశుద్ధి జలాల ఫ్లాంట్‌ నిర్మాణానికి హామీ ఇచ్చారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్డు నిర్మించుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరారు. ఇలా ఆయా వ్యక్తులు పోషించిన పాత్రల ను జీర్ణించుకుని, హీరోలు ప్రజాసేవలో మమేకమైతే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి కదా.

English summary

Oberoi commented on paritaala