భారత్ లో ఓబి స్మార్ట్ ఫోన్లు 

Obi Smart Phones To Launch In India

04:44 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Obi Smart Phones To Launch In India

భారత్ మొబైల్ మార్కెట్లో కి ఓబి స్మార్ట్ ఫోన్లు ప్రవేశించనున్నాయి. టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మాజీ సిఈఓ జాన్ స్కుల్లీ ఓబి మొబైల్ ఫోన్ల సంస్థను ప్రారంభించారు. ఓబి తన కొత్త ఓబి SF1 స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చెయ్యబోతోంది.

ఈ ఓబి SF1 రెండు వేరియంట్లలో లభ్యం కానుంది . 32 జీబి ఇంటర్నల్ మెమరీ కలిగి ఉన్న ఫోన్ లో 3 జ్జిబి రామ్ ను , 16జీబి ఇంటర్నల్ మెమరీ కలిగిన ఫోన్ లో 2 జీబి రామ్ ను పోడుపరచింది . ఈ స్మార్ట్ ఫోన్లో 5 ఇంచుల హెచ్ డి డిస్ప్లే , డ్యూయల్ సిమ్,1.5 గిగాహెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ 615 ఆక్టా కోర్ ప్రాసెసర్, 13 మెగా పిక్సెళ్ళ వెనుక కెమెరా 5 మెగా పిక్సెళ్ళ వెనుక కెమెరా ఉన్నాయి.ఈ రెండు కెమెరాలు కూడా ఎల్ఈడి ఫ్లాష్ తో రానున్నాయి. అత్యధిక సామర్ధ్యం కలిగిన 3000 ఎంఎహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ లో ఉన్నాయి.

దీని ధర 15,000 ఉంటుందని, ఈ ఫోన్ జియోమి MI4 , మోటో G (3rd జనరేషన్), వన్ ప్లస్ X , అసుస్ ZENFONE2 లకు మంచి పోటినిస్తుందని అని తెలిపారు. ఐతే ఈ ఫోన్ ను ఇండియా లో ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు .

English summary

Obi Smart Phones to launch in india soon. Obi phone company founder was the ex ceo of apple company. Obi Smart phone Comes with excellent features. Company did not mentioned when these phones are launching in india