సంజయ్ దత్ ముందస్తు విడుదలపై దుమారం 

Obstacle On Sanjay early release

06:10 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Obstacle On Sanjay early release

సహచట్టం కింద అడిగిన రాజీవ్ హత్య కేసు నిందితుడు

యుపిఎ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సమాచార హక్కు చట్టం మాజీ ప్రధాని రాజీవ్ గాంధి హంతకుల్లో ఒకరికి ఇప్పుడు ఆయుధం గా మారిందా? అది కూడా ముంబయి పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ ముందస్తు విడుదలకు సంబంధించిందే. సంజయ్‌దత్‌ను ఏ చట్టం కింద శిక్షా కాలానికి ముందే విడుదల చేస్తున్నారో స్పష్టం చేయాలని రాజీవ్‌గాంధీ హత్య కేసు నిందితుడు పేరరివాళన్‌ నిలదీస్తున్నాడు. వేలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాళన్‌.. ఎరవడ జైలు అధికారికి ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం కూడా అయింది. సత్ప్రవర్తన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందని, ఆయన్ను ముందుగానే విడుదల చేయడానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాల నకళ్లను తనకు పంపాలని దరఖాస్తులో కోరాడు.'సంజయ్‌దత్‌ ను భారత శిక్షాస్మృతి కింద ముందుగానే విడుదల చేస్తున్నారా? లేదా మహారాష్ట్ర జైలు నిబంధనల కింద విడుదల చేస్తున్నారా?' అనేది కూడా స్పష్టం చేయాలని లేఖలో పేర్కొన్నాడు. 25 ఏళ్లుగా జైలులో మగ్గుతున్న తాను కూడా ముందుగానే విడుదలయ్యేందుకు ఆ వివరాలు తెలుసుకోగోరుతున్నానని పేరరివాళన్‌ అంటున్నాడు. మరి సంజయ్‌దత్‌ విడుదలపై రేగిన ఈ దుమారం రసవత్తర చర్చకు దారితీసింది.

English summary

An Accused person in Rajiv Gandhi's murder case was questioned that how sanjay sutt was releasing before his punishment time