పాపం భార్య శవాన్ని ఒక్కడే 10 కి.మీ మోస్తూ..(వీడియో)

Odisha man carried wife dead body for 10 km on shoulder

10:43 AM ON 26th August, 2016 By Mirchi Vilas

Odisha man carried wife dead body for 10 km on shoulder

ఇది చూసిన వారెవరికైనా కంట నీరు వస్తుంది. మరి అతని కష్టం అలాంటిది. ఒడిశాలోని కలహండి జిల్లాలో ఇదో సంచలన ఘటన. వివరాల్లోకి వెళ్తే.. చనిపోయిన తన భార్య డెడ్ బాడీని తరలించేందుకు వాహనం లేక ఓ పేద గిరిజనుడు ఆ మృత దేహాన్ని భుజాన వేసుకుని ఆసుపత్రి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. ఈ జిల్లాలోని మేల్ఘారా గ్రామంలో 42 ఏళ్ళ దనమాజీ అనే వ్యక్తి భార్య అమాంగ్ దే క్షయ వ్యాధితో బాధ పడుతోంది. ఆమెను చికిత్స కోసం అరవై కి.మీ. దూరంలోని భవానీ పాట్నా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 23న మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఆసుపత్రిలో ఎవరూ సాయపడలేదు.

దీంతో దనమాజీ తన భార్య డెడ్ బాడీని కొన్ని దుస్తుల్లో చుట్టి భుజాన మోసుకుంటూ తన 12 ఏళ్ళ కూతురితోబాటు సుమారు 10 కి.మీ.దూరం నడిచాడు. చివరకు ఈ విషయం జిల్లా కలెక్టర్, మీడియా ద్వారా తెలుసుకుని వాహనాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించిన పేదల మృత దేహాలను వారి ఊళ్లకు ఉచితంగా తరలించేందుకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మహా పారాయణ అనే స్కీమ్ ను ప్రవేశపెట్టింది. అయితే అధికారుల అలసత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో ఈ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. ఇప్పటికైనా ఈ పధకం అమలయ్యేలా చూసి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

English summary

Odisha man carried wife dead body for 10 km on shoulder