మనం వాడే వంట నూనె దేని నుండి తీస్తున్నారో తెలిస్తే భయపడతారు!

Oil making from dead animal bodies

11:41 AM ON 5th October, 2016 By Mirchi Vilas

Oil making from dead animal bodies

ఎవరెన్ని మొత్తుకున్నా కొన్ని అలాగే జరిగిపోతుంటాయి. దశాబ్ధాలు కాదు శతాబ్ధాలు గడిచినా కొన్ని అపరిష్కృతంగానే ఉంటాయి. ఇదంతా ఎందుకంటే, చాలా ప్రాంతాల్లో ఎముకల నుంచి నూనె తయారు చేసే పరిశ్రమలు వెలిశాయి. అధికారుల అలసత్వం, స్థానిక నాయకుల అండదండలతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రంగారెడ్డి జిల్లాలోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జంతు కళేబరాలతో నూనె తయారుచేస్తున్న పరిశ్రమపై ఎస్ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 52 డ్రమ్ముల ఆయిల్ తో పాటు 8టన్నుల కొవ్వును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కళేబరాల నుంచి నూనె తయారు చేస్తున్న ఎనిమిది మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హోటళ్లకు సరఫరా... నగరంలోని హోటళ్లకు ఈ పరిశ్రమలనుంచే నూనె, డాల్డాను సరఫరా చేస్తున్నట్లు ఇక్కడ పని చేస్తున్న సిబ్బంది అంటున్నారట. హోటళ్ల నిర్వాహకులు ప్రతీ రోజు ఇక్కడికి వచ్చి.. తాము తయారు చేసిన నూనె, డాల్డా తీసుకెళ్తున్నట్టు వారు తెలిపారు. ఘటనా స్థలంలో 50 డ్రమ్ములలో తయారైన డాల్డా, నూనె నిల్వచేసి, ఉండడాన్ని గుర్తించారు.

1/2 Pages

గతంలో రెండుసార్లు..


ఇదే స్థలంలో గతంలో రెండుసార్లు ఎముకల నుంచి నూనె, డాల్డాను తయారు చేస్తుండగా పోలీసులకు పట్టించామని గ్రామస్తులు తెలిపారు. ఆ సమయంలో కేవలం కార్మికులను సామగ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అసలు నింధితున్ని అదుపులోకి తీసుకోలేదని వారు ఆరోపించారు. ఏది ఏమైనా తప్పదు కాబట్టి తెలిసిన కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. డబ్బుల కోసం మనుషుల ప్రాణాలు తీసే ఇలాంటి వారికి గుణపాటం చెప్పే రోజు రావాలి. మీ చుట్టూ కూడా ఇలానే జరుగుతుంటాయి కానీ మనకి తెలియదు. అనుమానం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం చెప్పాలి. అంతేకాదు మనం కూడా జాగ్రత్త వహించాలి. కసాయిలకు ప్రాణం విలువ తెలీనందున ప్రజలే సంప్రదించాలి.

English summary

Oil making from dead animal bodies