ఏప్రిల్ లో ‘ఒక్క అమ్మాయి తప్ప’

Oka Ammayi Thappa To Release On April

11:00 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Oka Ammayi Thappa To Release On April

యంగ్ హీరో సందీప్ కిషన్, క్యూట్ బ్యూటీ నిత్యామీనన్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ( All Indians are My Brothers and Sisters ) అనేది ఉపశీర్షిక. సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు కెమెరామెన్‌గా వ్యవహారిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ రచయిత రాజసింహ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుని రీసెంట్‌గా టాకీ పార్ట్ పూర్తి చేశారు.సందీప్ కిషన్, నిత్యామీనన్ తో పాటూ రవి కిషన్, అలీ, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, రావు రమేష్‌, రాహుల్ దేవ్, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్, నళిని, జ్యోతి, రేవతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా ఛోటా కె.నాయుడు వున్నాడు. ఆర్ట్‌: చిన్నా, మ్యూజిక్‌: మిక్కి జె.మేయర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆళ్ళ రాంబాబు, సహ నిర్మాత : మాధవి వాసిపల్లి, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : రాజసింహ తాడినాడ

ఇక చిత్ర నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. మూడు పాటలు చిత్రీకరణ చేయాల్సిఉంది. ఇందులో ఒక పాటను ఇండియాలో మరో రెండు పాటలను విదేశాల్లో చిత్రీకరిస్తాం. ఇదొక డిఫ‌రెంట్ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్. ఏప్రిల్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని వివరించాడు.

English summary

Upcoming film of young hero Sundeep Kishan was "Oka Ammayi Thappa".Nityamenon was acting as heroine in the movie and this movie was going to be released on April Month