నిజంగా ‘ఒక్క అమ్మాయి తప్ప’

Okka Ammayi Thappa Audio Released

12:08 PM ON 10th May, 2016 By Mirchi Vilas

Okka Ammayi Thappa Audio Released

సందీప్‌కిషన్‌, నిత్య మీనన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. రాజసింహ దర్శకుడు. బోగాది అంజిరెడ్డి నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలి సీడీని సాయిధరమ్‌తేజ్‌ ఆవిష్కరించగా, బోయపాటి శ్రీను అందుకొన్నాడు. రెజీనా, రాశీ ఖన్నా, రవికిషన్‌, మేర్లపాక గాంధీ, పరుచూరి వెంకటేశ్వరరావు, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ ‘‘ఇది కూడా నా సినిమానే. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కడంలో నాకూ భాగముంది. సందీప్‌కిషన్‌కి మిగిలిన సినిమాలన్నీ ఒకెత్తు. ఈ సినిమా మరో ఎత్తు. తన నటన వైవిధ్యంగా ఉంటుంది' అన్నాడు. ‘‘విభిన్నమైన చిత్రాల్ని ఎంచుకొంటూ ముందుకెళ్తున్నాడు సందీప్‌. ని త్యామీనన్‌ సినిమా అంటేనే ఓ ప్రత్యేకత సంతరించుకొంటోంది. వీళ్లిద్దరి కలయికలో తప్పకుండా ఓ మంచి చిత్రమే వస్తుందన్న నమ్మకం ఉందని’’ గుణశేఖర్‌ అన్నాడు. సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ ‘‘ఓ విజయవంతమైన సినిమా కోసం కాదు, ఓ గొప్ప సినిమా తీయడం కోసం మేం చేసిన ప్రయత్నమిది. ఈ సినిమా కోసం చోటా మావయ్య డబ్బులు తీసుకోకుండానే పనిచేశారు. నా నటన బాగుందన్న పేరొస్తే అందులో ని త్యాకీ వాటా ఉంటుంది’’ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:రోబో 2.0 లో గ్రాఫిక్స్ కోసం 100 కోట్లు

ఇవి కూడా చదవండి:అది తప్పేలా అవుతుంది అంటున్న అనుష్క

ఇవి కూడా చదవండి:భార్యను వ్యభిచారంలోకి దింపిన భర్త.. ఆ తరువాత భర్తకు షాకిచ్చిన భార్య

English summary

Young Hero Sundeep Kishan and Nitya Menon together acted in a film named "Okka Ammayi Thamma" and the audio of the movie was released by Director V.V.Vinayak. Regina,Sai Dharam Tej,Rashi Khanna and few others were attended as chief guests to this audio launch event.