ఓలా నుండి మనీ యాప్

Ola launches Ola money app

05:49 PM ON 13th November, 2015 By Mirchi Vilas

Ola launches Ola money app

క్యాబ్ సర్వీసులతో దూసుకుపోతున్న ఓలా సంస్థ ఇప్పుడు కొత్తగా ఓలా మనీ పేరుతో యాప్ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న పేటిఎం, మొబిక్విక్, ఫ్రీచార్జ్లకు గట్టిపోటీనిచ్చేందుకు అన్నట్లు ఓలా సంస్థ తన కొత్త మొబైల్ వాలెట్ యాప్ను సిద్ధం చేస్తుందట. 40మిలియన్ యూజర్లను కలిగి ఉన్న జిప్కాష్ సంస్థతో జట్టుకట్టిన ఓలా మరింత దూకుడుతో మొబైల్ వాలెట్ ప్లాట్ఫాంలో దూసుకుపోవాలని చూస్తోంది. తన మొబైల్ వాలెట్ ద్వారా ఓలా సంస్థ తమ టాక్సీ సర్వీసు ఉపయోగించుకునే వారు చెల్లింపులు జరుపుకునేలా యాప్ను సిద్ధం చేసింది. ఈ ఆగస్టులో మరిన్ని సంస్థలతో జట్టు కట్టింది ఈ సంస్థ. హోటల్ రంగంలో దూసుకుపోతున్న ఓయో రూమ్స్, ఈకామర్స్ సైట్లు లెన్స్కార్ట్, సావన్ల వినియోగదారులకు కూడా పేమెంట్ సేవలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇతర మొబైల్ వాలెట్లు అందించేసేవల తరహాలోనే ఓలా మొబైల్ వాలెట్ మొబైల్ రీచార్జ్, మనీ ట్రాన్స్ఫర్ వంటి మొబైల్ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తుంది. ఇప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న పేటియం కు చైనా ఇకామర్స్ దిగ్గజం ఆలీబాబా అండదండలు అందిస్తోంది. పేటిఎం కు ఇప్పటికే 100మిలియన్ యూజర్లు ఉండగా, మొబీక్విక్ కు 25 మిలియన్ల యూజర్లు ఉన్నారు.

English summary

Ola launches Ola money app.ola launches new app ola money for mobile reachers and mobiles