మళ్లీ అందుబాటులో పాత రూ.500 నోటు !?

Old Currency Note Rs 500 May Be Active Soon

10:50 AM ON 31st December, 2016 By Mirchi Vilas

Old Currency Note Rs 500  May Be Active Soon

రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ నవంబరు 8వ తేదీ రాత్రి ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇందుకు 50 రోజుల గడువు కోరారు. ఆ గడువు శుక్రవారం రాత్రితో ముగియనుంది. ఆ నేపథ్యంలో, ఆదివారం కొత్త సంవత్సరం కూడా కావడంతో శనివారం రాత్రి ఆయన మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూనే... పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలు, భవిష్యత్తులో చేపట్టే చర్యలపై వివరిస్తారని, నోట్ల రద్దుతో సాధించిందేమిటి? నష్టపోయింది ఏమిటి? భవిష్యత్తులో తీసుకునే చర్యలు ఏమిటి? తదితర అంశాలపై ప్రధాని మాట్లాడతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన రకరకాల ప్రకటనల ఆధారంగా మోడీ ప్రకటనపై పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

పాత నోట్లు చెలామణిలోకి ...

అయితే రూ.1000, రూ.500 నోట్లరద్దు నిర్ణయం దేశ ప్రజలకు ఎలాంటి కష్టాలు మిగిల్చిందో కేంద్రానికి కూడా బాగా తెలిసొచ్చింది. 50 రోజులు గడిచినా ఈ కరెన్సీ కష్టాలు కొలిక్కిరాలేదు సరికదా.. కనుచూపుమేరలో తొలగేలా కనిపించడంలేదు. అత్యావసరమైన డబ్బు అవసరం ప్రజలకు ప్రతీ రోజూ ఉండటంతో ప్రతిరోజూ ప్రజలు బ్యాంకులకు క్యూకడుతున్నారు. అయితే, నోట్లు ముద్రించే సామర్థ్యం ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ఓ వైపు ముద్రణా సిబ్బంది కూడా అదనపు డ్యూటీలతో విసిగిపోయారని, అధికపనిగంటలు చేసేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం సరికొత్త నిర్ణయాలు తీసుకోబోతోంది. ఈనేపధ్యంలో పాత రూ. 500 నోటుని తిరిగి చెలామణీలోకి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. అంతేకాదు, అయితే, ప్రధాని మోడీ ఈ నిర్ణయాన్ని తూచా తప్పక పాటిస్తే విపక్షాలు, ప్రజల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది హాట్ టాపిక్ అయింది.

2,000 నోటు రద్దు!.. కొత్తగా 1000 నోటు..

కొత్త వెయ్యి రూపాయల నోటును విడుదల చేయడంపైనా, ఇటీవలే చలామణిలోకి తెచ్చిన రూ.2,000 నోటు రద్దుపైనా ప్రధాని ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న 10, 20, 50 కాగితపు నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టడంపైనా ప్రకటన చేయవచ్చని అంటున్నారు. ప్రజల ఇక్కట్లు తొలగేలా పెద్ద నోట్లను మార్కెట్లోకి భారీగా తరలించే అంశాన్ని కూడా ప్రస్తావించనున్నారు. 50 రోజుల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించొచ్చు.

పంట రుణాల రద్దు!

రుణాల ఊబిలో చిక్కుకుని విలవిలలాడుతున్న రైతన్నకు ప్రధాని భారీ ఊరటనిచ్చే ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. పంట రుణాలను పూర్తిగా రద్దు చేస్తారని, ఆ దిశగా కీలక ప్రకటన చేయొచ్చని అంటున్నారు.

‘జీరో‘ జన్ ధన్ ఖాతాల్లోకి పది వేలు!

నోట్ల రద్దు అనంతరం జన్ ధన్ ఖాతాల్లో భారీగా నగదు చేరింది. అయితే.. ఇప్పటికీ జీరో బ్యాలెన్స్ ఉన్న ఖాతాదారులకు రూ.10 వేలు నజరానా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

వితడ్రా ఆంక్షలు తొలగింపు!

కాగా ప్రస్తుతం బ్యాంకుల నుంచి, ఏటీఎంల నుంచి నగదు వితడ్రాయల్ పై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తన ప్రసంగంలో మోడీ వీటిని ఎత్తివేయడంపై మాట్లాడతారు.

బినామీ ఆస్తులపై కీలక ప్రకటన

ఇటీవల ప్రకటించినట్లుగా బినామీ ఆస్తులపై చర్యలకు ప్రధాని ఓ కీలక ప్రకటన చేయవచ్చు. దీనిపై విధాన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి.

English summary

Old Currency Note Rs 500 May Be Active Soon.