గిన్నీస్ బుక్ 'వరల్డ్ ఓల్డ్ మాన్' కన్నుమూత 

Old Man Earth Dies Today

01:17 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Old Man Earth Dies Today

ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో వున్న అధికారిక లెక్కల ప్రకారం అత్యంత కురువృద్ధుడు, గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులోకెక్కిన వరల్డ్ ఓల్డ్ మాన్ 'యసుటారో కొయిడే' కన్నుమూశారు. ఈయన వయస్సు 112 ఏళ్ళు. జపాన్‌కి చెందిన కొయిడే, రైట్‌ సోదరులు విమానాన్ని తయారుచేయడానికి కొద్ది నెలల ముందు జన్మించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. 1903 మార్చి 13న గత కొంతకాలంగా కొయిడే అనారోగ్యంతో బాధ పడుతూ, ఇటీవల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ, మంగళవారం నగోయా పట్టణంలో మృతిచెందారని వార్త. ప్రపంచ కురువృద్ధుడిగా గతేడాది ఆయనను అధికారులు గుర్తించారు. కొయిడే దర్జీపని చేసి జీవితం గడిపారని, అత్యధిక వయసుగల వ్యక్తిగా ఆయన గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో చోటు దక్కించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

కొయిడె దీర్ఘాయుష్షుకు రహస్యమేమిటీ అని గతంలో ఆయనను పలువురు అడిగేవారట. అందుకు ఆయన ‘శక్తికి మించి పనిచేయవద్దు... ఆనందంగా జీవించాలి’ అని చిరునవ్వుతో బడులిచ్చేవారట. ప్రపంచ దేశాల్లో జపాను వాసులే దీర్ఘాయుష్కులుగా ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడి జనాభాలో నాలుగో వంతు 65 ఏళ్లు పైబడిన వారే. విశ్వ కురువృద్దుడు మరణంతో పలువురు తీవ్ర విచారం వ్యక్తంచేసారు.

English summary

Old Man Earth Yasutaro Koide Dies Today at the age of 112 years. He was born on march 163th ,1903