అమ్మ తోడు... సైకిళ్ళపై గస్తీ తిరగాల్సిందేనట

Old style bicycle patrolling back in Chennai

10:58 AM ON 2nd July, 2016 By Mirchi Vilas

Old style bicycle patrolling back in Chennai

అమ్మ తలచిందట జరిగి తీరాల్సిందే... మళ్లీ కోపం వస్తే తట్టుకోవడం కూడా కష్టమే అందుకే అమ్మ ఏమి చెప్పినా అది జరిగిపోతుంది. ఇంతకీ అమ్మ ఎవరో ఈపాటికే తెల్సి పోయి ఉంటుంది. అదేనండీ తమిళనాడు సీఎం జయలలిత .. ఇటీవల ఎన్నికల్లో మరోసారి గెలిచి , చాన్నాళ్ల తర్వాత వరుసగా రెండవసారి అధికారం పొందిన రికార్డు కూడా ఈమె సొంతం చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే, ఒకప్పుడు చెన్నై లో పోలీసులు సైకిళ్ళపై గస్తీ తిరిగేవారట. ఆ పాత పద్ధతిని జయ మళ్ళీ అమల్లోకి తెస్తున్నారు. చెన్నై లో టెక్కీ స్వాతి మర్డర్ తో బాటు ఈ వారం రోజుల్లో మరో రెండు హత్యలు జరగడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది మెయిన్ రోడ్ల మాట అటుంచి సందులు, జన సమ్మర్ద ప్రాంతాల్లో జరిగే నేరాలను అరి కట్టాలంటే ఇవే బెస్ట్ అని ప్రభుత్వం భావించింది. మోటారు సైకిళ్ళు, వ్యాన్ల పై గస్తీ కన్నా ఇదే బెటరని జయలలిత సర్కార్ ఈ పద్ధతి మీద ఫోకస్ పెట్టిందట. ఇందుకోసం 250 సైకిళ్ళను, వంద బైక్ లను ఆయా పోలీసు స్టేషన్లకు కేటాయించింది. ఇందుకు రూ. 1.13 కోట్లు ఖర్చయిందట. జయ తలచుకుంటే అంతేమరి.

ఇది కూడా చూడండి: ఎత్తు పెరగాలంటే ఇవి తినాల్సిందే

ఇది కూడా చూడండి: స్త్రీలు చేసేవి చేయకూడనివి

ఇది కూడా చూడండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

English summary

Old style bicycle patrolling back in Chennai.