అగ్నిప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనం 

Old Woman Burned Alive

05:54 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Old Woman Burned Alive

ఎపిలోని కృష్ణా జిల్లా విజయవాడ రాజీవ్‌గాంధీ పార్కు సమీపంలో పూల మార్కెట్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటల్లో సుమారు 100కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో రమాదేవి(60) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. విషయం తెల్సిన ఫైర్ సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో మరో 30 గుడిసెలు ఉండటంతో వాటికి మంటలు అంటుకోకుండా చర్యలు చేపట్టారు. గుడిసెల్లో ఉన్న రెండు సిలిండర్లు పేలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ సంఘటనాస్థలాన్ని పరిశీలించి సహాయచర్యలపై సమీక్ష నిర్వహించారు.

కాగా అగ్నిప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ పురపాలకశాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. బాధితులకు పునరావాసం కల్పించి, శాశ్వత పరిష్కారం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

English summary

In a Fire accident in Vijayawada, Krishna District an old woman was burned alive.That old woman name was ramadevi and her age was 60 years.In this fire accident 30 huts were fired .Andhra pradesh municipal corporation minister Narayana Visits ordered officials to know the reasons behind that incident