ట్రైన్‌ టాయిలెట్‌లో కాలు ఇరుక్కుని నరకయాతన

Old Woman Leg Strucks In Train Toilet

01:22 PM ON 12th December, 2015 By Mirchi Vilas

Old Woman Leg Strucks In Train Toilet

ట్రైన్‌ టాయిలెట్‌లో కాలు ఇరుక్కుని బయటకు తీసేందుకు వీలులేక పదిగంటలపాటు నరకయాతన పడిన వృద్ధురాలి ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఘటక్‌పూర్‌కు చెందిన 65ఏళ్ళ రబియాబీ షేక్‌ అనే వృద్ధురాలు తన భర్తతో కలిసి కొంకణ్‌ కన్య ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజాము సమయంలో టాయిలెట్‌కు వెళ్ళిన రబియాబీషేక్‌ కాలు ప్రమాదవశాత్తు టాయిలెట్‌ కమోడ్‌లో చిక్కుకుని పోయింది. కాలు ఇరుక్కునిపోవడంతో టాయిలెట్‌ డోర్‌ లోపలనుండి తెరవడానికి వీలు లేకుండా పోయింది. తన భర్తను సహాయం కోసం కేకలు వేసినప్పటికీ భర్త వెలుపలి నుండి డోర్‌ను తెరవలేకపోవడంతో అలాగే బాధతో 10గంటల పాటు ట్రైన్‌ టాయిలెట్‌లోనే గడపాల్సి వచ్చిందట. తోటి ప్రయాణికులు సైతం డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆఖరుకి రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో వెల్డింగ్‌ చేసి డోర్‌ను తెరిచారు. 10గంటల దారుణమైన బాధ అనంతరం ఉదయం 12.30 సమయంలో సదరు వృద్ధురాలిని బయటకు తీసుకురాగలిగారు.

English summary

A 65 year Old woman who was travelling in train has strucked for 10 long hours in train toilet. When she enter into train bathroom her leg accidentally strucked in bathroom