ఇండియాకి స్వర్ణం, కాంస్యం తెచ్చిన వీరులు వీరే!

Olympics winners

05:18 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Olympics winners

ఇటీవల ఒలింపిక్స్ లో పతకం ఎప్పుడెప్పుడా అని కోట్లాది భారతీయులు ఎదురుచూసారు. చివరికి ఓ రజతం.. ఓ కాంస్యం రావడంతో ఊరట చెందారు. పసిడి కల అలానే మిగిలిపోయింది! ఇంతలో పారాలింపిక్స్ వచ్చేసాయి. స్వర్ణం కోసం ఎక్కువ నిరీక్షించాల్సిన అవసరమే లేకపోయింది. స్వర్ణంతో పాటూ కాంస్యం వచ్చేసాయి. హైజంప్ టీ42 విభాగం ఫైనల్లో ముగ్గురు భారతీయులు పోటీపడ్డారు. ముగ్గురూ అసాధారణ ప్రదర్శన చేశారు. తమిళ తంబీ తంగవేలు మారియప్పన్, వరుణ్ ఇద్దరూ పతకాలతో మురిసిపోయారు. అయితే శరత్ కుమార్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఆరంభంలో అతడే అందరికంటే ముందున్నా, 1.77 మీటర్లు ఎత్తు మాత్రమే ఎగిరిన శరత్ ఆరో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకేసారి స్వర్ణం, కాంస్యం రావడంతో భారతీయులు ఆనందానికి అవద్దుల్లేవ్. అందుకే జాతి యావత్తు అభిననందనలతో ముంచెత్తిన్ది.

1/10 Pages

1. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన మారియప్పన్...


అంచనాల ఒత్తిడి లేకుండా బరిలో దిగిన 21 ఏళ్ల మారియప్పన్ తంగవేలు పసిడితో చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్ హైజంప్ లో స్వర్ణం సాధించిన భారత తొలి ఆటగాడు మారియప్పన్ నిలిచాడు. శనివారం ఫైనల్లో 1.89 మీటర్లు ఎత్తు ఎగిరిన తంగవేలు అగ్రస్థానంలో నిలిచాడు.

English summary

Olympics winners. Olympics winners who won Gold and silver medals.