నాగ్ కొత్తా దేవుడండీ...!!

Om Namo Venkatesaya movie God

01:16 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Om Namo Venkatesaya movie God

ఈ ఏడాది వరసగా రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు నాగార్జున. అదే ఊపులో ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నాడు. సినిమా సినిమాకి జానర్స్ ను మార్చే అలవాటున్న నాగ్, ప్రస్తుతం డివోషనల్ జానర్ లో చేస్తున్న మరో చిత్రం ఓం నమో వేంకటేశాయ. వెంకటేశ్వరుని పరమ భక్తుడైన హాధీరామ్ బాబాజీ జీవిత చరిత్రగా ఈ సినిమా రూపొందుతోంది. దర్శకేంద్రుడు మరోసారి తన ట్రేడ్ మార్క్ టేకింగ్ తో జనాన్ని కట్టిపడేయడానికి సిద్ధపడుతున్నాడు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తి చిత్రాల్లో వెంకటేశ్వర స్వామిగానూ, శ్రీరాముడిగానూ సుమన్ మంచి పేరు తెచ్చుకున్నాడు.

అయితే ఈసారి మాత్రం రాఘవేంద్రరావు వెంకటేశ్వరుడిగా హిందీ నటుడ్ని తీసుకొని అందరికీ షాకిచ్చాడు. ఈ నేపధ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో వేంకటేశ్వరుడి గెటప్ లో హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్ అలరిస్తున్నాడు. టీవీ దేవుడిగా ఇతడు నార్త్ జనానికి బాగా సుపరిచితుడు. బహుశా ఈ సినిమాను హిందీలోకూడా విడుదల చేసే ఉద్ధేశంతోనే సౌరభ్ రాజ్ జైన్ ను వెంకటేశ్వర స్వామి పాత్రకు ఎన్నుకొన్నాడు. స్వామి ఆవిష్కరణ అంటూ మొదలైన మోషన్ పోస్టర్ జనాన్ని బాగా ఆకట్టుకుంటోంది.

English summary

Om Namo Venkatesaya movie God