భక్తిరసం చూపిస్తున్న 'ఓం నమో వెంకటేశాయ' లోగో

Om Namo Venkatesaya movie title logo

04:33 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Om Namo Venkatesaya movie title logo

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'ఓం నమో వెంకటేశాయ'. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి నాగార్జున లుక్ ను కొద్ది రోజుల క్రితం రాఘవేంద్రరావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రేక్షకులకి చూపించాడు. తాజాగా ఈ సినిమా లోగో బయటకొచ్చింది. లోగో విషయానికొస్తే.. శంకు, చక్రం మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. నాగార్జున శ్రీవారి పరమ భక్తుడైన హాథీరామ్ బాబా పాత్రలో కనిపించనున్నాడు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఒకసారి ఆ లోగో పై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.

English summary

Om Namo Venkatesaya movie title logo