ఆర్మీపై నటుడు ఓంపురి సంచలన వ్యాఖ్యలు

Om Puri sensational comments on Indian Army

04:18 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Om Puri sensational comments on Indian Army

సరిహద్దులో యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ రకరాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్ లోని ఆర్మీ స్థావరంపై ఉగ్రవాదుల దాడిలో 19 మంది సైనికులు అమరులైన ఘటనపై సినీనటులు చులకనగా మాట్లాడుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు ఓంపూరి సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూరీ, బారాముల్లా ఆర్మీ స్థావరాల్లో భారత జవాన్లు చనిపోవడంపై ఓ టీవీ ఛానెల్ చర్చలో ప్రశ్నించగా ఓంపూరి స్పందించారు. వారిని ఆర్మీలో చేరమని ఎవరన్నారు? ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు? వారినేమైనా బలవంతం చేశామా అని ఓంపూరి సమాధానమిచ్చారు.

దీనిపై కలకలం రేగింది. భారత సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఓంపూరిపై అంధేరీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

English summary

Om Puri sensational comments on Indian Army