బాహుబలి-2 సెట్స్ కు వెళ్లాలనుందా? అయితే ఏంచేయాలో చూడండి(వీడియో)

On the sets of Baahubali

11:40 AM ON 24th October, 2016 By Mirchi Vilas

On the sets of Baahubali

'బాహుబలి' సినిమా చూసిన వాళ్ళు, 'బాహుబలి -2' కోసం ఎదురుచూస్తున్నవాళ్ళు కూడా ఆ విజువల్ వండర్స్... ఆ ఫైట్ సీన్స్.. అబ్బో.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవనుకోండి అంటుంటారు. ఇక ఆ సెట్టింగ్స్ స్వయంగా చూసే అదృష్టం కలిగితే ఇంకేమనాలో చెప్పండి. అందుకే మనకు దేవుడు ఇచ్చిన రెండు కళ్లకు ఏఎండీ రేడియోన్ టెక్నాలజీస్ గ్రూప్ తయారు చేసిన వీఆర్(వర్చువల్ రియాలిటీ) హెడ్ సెట్ పెట్టుకుంటే బాహుబలి సెట్స్ లో జరుగుతునన్న అద్భుతాలను కళ్లకు 'కట్టి'నట్లు చూడొచ్చట. అంతేకాకుండా మనం ఆ సెట్స్ లో ఉన్న అనుభూతిని కూడా పొందుతామట.

'ఆన్ ది సెట్స్ ఆఫ్ బాహుబలి' పేరుతో బాహుబలి టీమ్ రిలీజ్ చేసిన వీడియో వీఆర్ హెడ్ సెట్ ద్వారా తిలకిస్తే 'బాహుబలి-2' సెట్స్ కు వెళ్లినట్టే అని దర్శకుడు రాజమౌళి చెబుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో ఎలా చూడాలి అనే దాన్ని కూడా రాజమౌళి మరో వీడియో ద్వారా వివరించారు. ఆ వీడియోలో అనుష్క, రానా ఒకరి తర్వాత ఒకరు వీక్షకులకు బాహుబలి సెట్స్ ను పరిచయం చేస్తున్నట్లు చిత్రీకరించారు. నేడు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఈ వీడియో ఓ కానుకగా ఇస్తున్నట్లు రాజమౌళి ప్రకటించాడు.

English summary

On the sets of Baahubali