జెనిలీయాకి మళ్ళీ కొడుకే పుట్టాడు ..

Once again Genelia gives birth to a baby boy

11:21 AM ON 2nd June, 2016 By Mirchi Vilas

Once again Genelia gives birth to a baby boy

పలు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనిలీయా 2012 లో బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లాడిన తర్వాత నటనకు గుడ్‌బై చెప్పేసింది. రెండేళ్ల క్రితం ఓ బాబుకు జన్మనిచ్చిన ఈ అమ్మడు బుధవారం మరో మగ బిడ్డకు జన్మనిన్చ్చింది. ఈ విషయాన్ని రితేశ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అది కూడా తన పెద్ద కొడుకు రియాన్ ట్విట్టర్లో స్పందిస్తున్నట్లు పేర్కొన్నాడు. ‘ హే గయ్స్ మా మమ్మీ, డాడీ నాకు ఇప్పుడే ఓ చిట్టి తమ్మున్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇక నా బొమ్మలన్నీ తమ్ముడికే’ అని రియాన్ పోస్ట్ చేసినట్లుగా రితేజ్ తన ట్విట్టర్లో తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖులు జెనీలియా దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెనీలియా సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతుందా?

ఇది కూడా చూడండి:అ..ఆ.. మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇది కూడా చూడండి:సంపన్నులతో డేటింగ్ చేస్తూ, లక్షలు ఆర్జిస్తున్నాడు

ఇది కూడా చూడండి:డాన్స్ మాస్టర్ ని డాన్స్ ఆడిస్తున్న కోడలు

English summary

Riteish Deshmukh and wife Genelia famous film actors. Once again Genelia gives birth to a baby boy.