రోజాపై రూ కోటి పరువు నష్టం దావా

One crore defamation suit on MLA Roja

05:22 PM ON 27th January, 2016 By Mirchi Vilas

One crore defamation suit on MLA Roja

తన పై అసభ్యకర వ్యాఖ్యలు చేసారన్న ఆరోపణ పై చిత్తూరు జిల్లా నగరి వైస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా పై కోటి రూపాయలకు విశాఖ జిల్లా పాయకరావుపేట తెదేపా ఎమ్మెల్యే వి.అనిత పరువు నష్టం దావా వేసారు. ఈ మేరకు విశాఖలో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... దళిత మహిళనైన తన పై రోజా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా కలచి వేసిందన్నారు. అసెంబ్లీలో చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు బయటకు ప్రచారం చేయడంతో తనతో పాటు, తన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయినట్లు ఆమె చెప్పారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని ఆమె ఆరోపించారు. కోటిరూపాయలకు పరువునష్టం దావా వేసిన తాను , న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. రోజాకు పార్టీలు మారటం అలవాటేనని ఆమె పేర్కొంటూ, ఏదో ఒకరోజు జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్‌ కుటుంబంలోని మహిళల పైనే వ్యాఖ్యలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.దళితుల గురించి మాట్లాడుతున్న జగన్‌, ఈ విషయంలో రోజాను మందలించకపోవడం దారుణమన్నారు.

English summary

Vishaka District Payakarao peta TDP MLA V.Anitha files One crore defamation suit on YSRCP MLA Roja .She says that YSRCP MLA Roja mis behaved in assembly sessions and she was also insulted her with her behaviour