ఆమె 5 అడుగులు ... అతడు అడుగున్నర.. అయినా ఇద్దరికీ కుదిరింది

One Feet Man To Marry 5 Feet Woman

11:32 AM ON 7th December, 2016 By Mirchi Vilas

One Feet Man To Marry 5 Feet Woman

ఆదర్శ వివాహాలంటే అనేక రకాలుంటాయి. కొందరు కులాంతరం ,మరికొందరు మతాంతరం... ఇలా పలు ఆదర్శ వివాహాలు చూస్తుంటాం. కానీ ఇదో రకమైన ఆదర్శ వివాహం. నిజమైన ఆదర్శ వివాహం కూడా. ఆమె ఎత్తు ఐదడుగులు... ఆయన ఒకటిన్నరడుగు! ఆమెకు 39 ఏళ్లు.. ఆయన వయసు 50 ఏళ్లు. ఇద్దరూ ఒకటయ్యారు. అతడు పుట్టుకతోనే వికలాంగుడైన ఆయన పట్టుదలతో చదువుకుని ఇప్పుడు కుటుంబానికి చేయూతగా నిలిచాడు. అందుకే అతడి గొప్ప మనసును మెచ్చిన ఆమె ఆదర్శ వివాహానికి సిద్ధమైంది. కర్ణాటకలోని గదగ్ జిల్లాలో ఆదివారం జరిగిన ఈ వివాహం అందరి మన్ననలు అందుకుంటోంది. పూర్తివివరాల్లోకి వెళ్తే...

గదగ్ ప్రాంతానికి చెందిన మల్లప్ప (50) పుట్టుకతోనే వికలాంగుడు. తల్లి సాయంతో బీఏ వరకూ చదువుకున్నాడు. అనంతరం కెంచవ్వ ప్రాంతానికి చెందిన పీఠాధిపతి సిద్ధలింగస్వామి మఠానికి అనుబంధంగా ఉన్న పాఠశాలలో 13 ఏళ్ల నుంచి క్లర్ గా పనిచేస్తున్నాడు. ప్రసుతం తల్లికి అతడే చేయూతగా నిలుస్తున్నాడు. వికలాంగుడిగా ఉన్నా కుటుంబ బాధ్యతల నిర్వహణలో ముందున్న మల్లప్ప మనసు అదే ప్రాంతానికి చెందిన శకుంతల (39)ను ఆకర్షించింది. దీంతో వీరిద్దరూ పెళ్ళికి సిద్ధపడ్డారు. పెద్దలందరి సమక్షంలో సోమవారం ఉదయం సంబాపుర మల్లజ్జ ఆలయంలో వీరి వివాహం ఆత్మీయంగా జరిగింది. వరుడు మల్లప్ప మాట్లాడుతూ జీవితకాలం తోడుగా వచ్చిన శకుంతల గొప్పదనం నచ్చిందన్నాడు. ఆమె తోడుగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. పలువురు మనసారా ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి: వాట్సాప్ లో కొత్తగా రెండు ఫీచర్స్!

ఇవి కూడా చదవండి: జయలలిత కోసం శోభన్ బాబు తపస్సు!

English summary

A One Feet Height Man Named Mallappa who was 50 year old and a 5 feet woman named Shakuntala who was 39 Year old were going to marry each other. Presently the Bridge Groom was Mallappa was working as a Clerk in a Near by School since 13 years.