ఆ ఒక్క అక్షరమే ఆమె ప్రాణాలు బలిగొంది

One Letter Spelling Mistake Leads To Death Of A Woman

06:34 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

One Letter Spelling Mistake Leads To Death Of A Woman

ఆ .. ఓ అక్షరం తప్పు పడితే ఏమిటిలే అని సరి పెట్టేస్తాం ... పైగా తప్పులు పడడం సహజం అంటూ లెక్చర్లు దంచేస్తారు ... కానీ ఓ అక్షరం తప్పు వస్తే , జీవితమే పోతుంది ... ఆలాంటిదే ఈ ఘటన ... పేరు రాయడంలో ఒక్క అక్షరం పొరపాటు కారణంగా ఓ వృద్ధురాలు తన ప్రాణాలు కోల్పోయింది. వివరాలలోకి వెళితే, లండన్‌కి చెందిన ఇర్మ్‌గార్డ్‌ కూపర్‌(85) అనే వృద్ధురాలికి కొద్ది రోజుల కిందట స్థానిక హారో నార్త్‌విక్‌ పార్క్‌ హాస్పిటల్‌లో గుండెకు శస్త్రచికిత్స చేసారు.

సర్జరీ అయిన కాసేపటికి ఉన్నట్టుండి ఆమె రక్తపోటు తీవ్రంగా పడిపోతుండడంతో వైద్యులు రక్తం ఎక్కించాలన్నారు. ఆపరేషన్‌కి ముందు ఆస్పత్రిలో రక్తం నిల్వలు లేవన్న సంగతి నిర్వాహకులు వైద్యులకు చెప్పలేదు. మరో చోటు నుంచి తెప్పించేసరికి ఆమె మృతి చెందింది.

బ్లడ్‌ శాంపిల్‌పై పేషెంట్‌ పేరు irmgard అని రాయబోయి irngard అని రాశారు. దీంతో పేరు వేరుగా ఉండడంతో అది ఆమె కోసమేనని నిర్ధారించుకుని తెచ్చేసరికి జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఆస్పత్రి అధికారుల ప్రాథమిక పరిశీలన ప్రకారం ... రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన సమస్యలు, కార్డియో వ్యాస్కులర్‌ కొలాప్స్‌, హెమరేజ్‌, సరైన సమయానికి రక్తం ఎక్కించకపోవడం... ఇర్మ్‌గార్డ్‌ మృతికి దారి తీసిన కారణాలు గా తేలింది. అయితే యాజమాన్యం అందుకు బాధ్యత వహిస్తామని ప్రకటించడమే కాక, ఇకముందు అలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా తగు జాగ్రత్త వహిస్తామని చెప్పింది. చూసారుగా అక్షరం తప్పు వల్ల జరిగే అనర్ధం ఎంత తీవ్రంగా వుంతోందో.

English summary