శరణార్థులు@ 10 లక్షలు

One Million Migrants Reached Europe

06:48 PM ON 30th December, 2015 By Mirchi Vilas

One Million Migrants Reached Europe

యూరోప్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న శరణార్థుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ వీరి సంఖ్య పది లక్షలు దాటింది. సముద్ర మార్గం, భూ మార్గం ద్వారా అక్రమ వలసలు జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్‌లో శరణార్థుల సంక్షోభం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. ఇస్లామిక్ దేశాల నుంచి శరణార్థులు అక్రమంగా వలస వస్తున్నారు. శరణార్థుల్లో సుమారు 80 శాతం మంది మొదటగా గ్రీస్‌కు చేరుకున్నారు. అందులో ఎక్కువ శాతం వలసదారులు లెస్‌బాస్ దీవుల్లోకి ప్రవేశించారు. టర్కీ, లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచే అధిక శాతం శరణార్థులు యూరోప్‌కు చేరుకున్నట్లు యూఎన్ నివేదిక తెలిపింది. సముద్ర మార్గం ద్వారా అక్రమ వలసలు అధికం అయ్యాయని ఆ సంస్థ పేర్కొంది.

English summary

More than one million refugees and migrants have reached Europe by sea since the start of 2015, according to the United Nations refugee agency (UNHCR).