శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎస్6 మినీ

One more model from Samsung: S6 Mini

06:44 PM ON 28th December, 2015 By Mirchi Vilas

One more model from Samsung: S6 Mini

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్6 మినీ పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే విడుదల చేయనుంది. పలు ఈ-కామర్స్ సైట్‌లలో ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పటికే పోస్ట్ చేసింది. అయితే ఫోన్ ధర, విడుదల తేదీని ఆ సంస్థ త్వరలో ప్రకటించనుంది.

ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.6 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 1.8 జీహెచ్‌జడ్ హెగ్జాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 15 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, యూఎస్‌బీ 3.0, బ్లూటూత్ 4.0, వైఫై 802.11 ఏసీ, వైఫై డైరెక్ట్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లను అందించనున్నారు.

English summary

Tech gaint Samsung soon releasing new model S6 Mini. This mobile model already listed on online retailer websites with specifications but price and launching date not yet confirmed.