శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎ9 2016

One more New model from Samsung A9 2016

05:42 PM ON 24th December, 2015 By Mirchi Vilas

One more New model from Samsung A9 2016

ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో కొత్త ఫోన్ ను త్వరలో లాంచ్ చేయనుంది. గెలాక్సీ ఎ9 2016 పేరిట ఈ నూతన స్మార్ట్ ఫోన్ త్వరలో మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ ఫోన్ ఎప్పుడు విడుదల చేసేది.. దీని ధర ఎంత అనే విషయాలను సంస్థ వెల్లడించలేదు. ఈ వివరాలను కొత్త సంవత్సరంలో వెల్లడించే అవకాశం ఉంది.

గెలాక్సీ ఎ9లో డ్యుయల్ సిమ్, 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 జీహెచ్‌జడ్ 64 బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్(128 జీబీ వరకు పెంచుకోవచ్చు), 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Worlds popular mobile phone manufacturer company Samsung soon launching new model. Its Samsung A9 2016, With lot of new feature.