దేశంలో ఒక్క శాతం మంది దగ్గర 60 శాతం సంపద ... సర్వేలో షాకింగ్ విషయాలు

One Percent Of Rich People Has 60 Percent Of India Wealth Says Survey

11:54 AM ON 28th November, 2016 By Mirchi Vilas

One Percent Of Rich People Has 60 Percent Of India Wealth Says Survey

అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని, అందరూ ఉన్నత స్థితికి చేరుకోవాలని ఎన్ని చెప్పినా, సోషలిజం వంటి సిద్ధాంతాలు నూరిపోసినా మార్పు మాత్రం కనిపించదు. అసలు ఏ దేశంలోనైనా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం నుంచి సమానమైన లాభాలు అందితేనే అప్పుడు ప్రజలందరి జీవన విధానం బాగుంటుంది. అందరూ ఒకేసారి ప్రగతిపథంలో దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ శతాబ్దాల కాలం నుంచి ముఖ్యంగా మిగిలిన దేశాలకంటే, మన దేశంలోనే ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలకు రావల్సిన ఫలాలు సరిగ్గా అందడం లేదు. అవి ఏమైనా బడాబాబులకు లాభాన్ని చేకూర్చడం కోసం మాత్రమే ప్రవేశపెట్టబడుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. భారత్లోని ఆర్థిక పరిస్థితులు, ధనిక, పేద వ్యత్యాసంపై ఓ సంస్థ చేసిన సర్వే చూస్తే, అందులోని విషయాలు షాక్ కి గురిచేస్తాయి.

స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో క్రెడిట్ సూసె గ్రూప్ ఏజీ అని పిలవబడే ఓ రీసెర్చ్ సంస్థ ఉంది. అది 2010 నుంచి ఆయా దేశాల ఆర్థిక స్థితి గతులు, ధనిక, పేద వ్యత్యాసం వంటి పలు అంశాలపై సర్వేలు చేస్తూ ఏటా నివేదికలు ఇస్తోంది. ఈసారి కూడా ఆ సంస్థ సర్వ చేసి పలు ఫలితాలను వెల్లడించింది. అందులో నిజంగా దిమ్మతిరిగే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. వాటివివరాల్లోకి వెళ్తే,

1/5 Pages

మన దేశంలో ఉన్న సంపన్నుల శాతం 1 పర్సెంట్ మాత్రమేనట. మిగతా 99 శాతం మంది మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు. అయితే ఆ 1 శాతం ఉన్న ధనికుల వద్దే దేశంలోని 58.4 శాతం సంపద అంతా నిక్షిప్తమై ఉందట. గత రెండేళ్ల క్రితం సదరు శాతం 49 ఉండగా, ఇప్పుడది ఏకంగా 9.4 శాతం పెరిగి 58.4 శాతానికి చేరుకుందట.

English summary

Recently a survey was made and the results were shocked everyone, according to that results 1 % percent of the people has owned 60 % of the Indian Economy.