ఒకే సిమ్ తో ఎన్నో నెట్వర్క్ లు

One Phone Multi Networks Feature

11:10 AM ON 9th January, 2016 By Mirchi Vilas

One Phone Multi Networks Feature

సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకూ విస్తృతం అవుతున్న నేపధ్యంలో వినియోగదారులకు కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ రంగంలో వస్తున్న మార్పులు రోజురోజుకీ కొంత పుంతలు తొక్కుతున్నాయి. అదే క్రమంలో విండోస్‌ -10 వినియోగదారులకు అరుదైన ఫీచర్ రూపొందించింది.

ఇంటర్నెట్‌ కోసం మీరు వాడుతున్న మొబైల్‌ నెట్‌వర్క్‌ సంతృప్తినివ్వడం లేదా ? ఇవ్వని పక్షంలో మీరు వేరే నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలనుకుంటున్నారా? ఐతే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ ఓ కొత్త సిమ్‌కార్డును రూపొందిస్తోంది. ఈ సిమ్‌తో మొబైల్‌ నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా ఇంటర్నెట్‌ వాడుకోవచ్చట.

ఇంతకీ విషయమేమంటే , విండోస్‌ 10 వినియోగదారుల కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థ సెల్యూలర్‌ డాటా యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను విండోస్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత మైక్రోసాఫ్ట్‌ అకౌంట్‌తో లాగిన్‌ అవ్వాలి. మనకు కావల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకున్న అనంతరం ఆ నెట్‌వర్క్‌ డాటాప్లాన్‌కి అనుగుణంగా డబ్బులు చెల్లించి, ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఆ డాటా వినియోగం తర్వాత కావాలనుకుంటే వేరే నెట్‌వర్క్‌ని కూడా ఎంచుకోవచ్చు.

ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే కేవలం మైక్రోసాఫ్ట్‌ సిమ్‌కార్డు ఉంటే చాలు. దీని ద్వారా త్వరలో ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ ఆఫర్‌లూ అందుబాటులోకి తేడానికి మైక్రోసాఫ్ట్ కసరత్తు చేస్తోంది. అంతా బానే వుంది కదా. అయితే సిమ్‌కార్డు ఎక్కడ... ఎప్పుడు అందుబాటులోకి తెస్తుందో మైక్రోసాఫ్ట్‌ త్వరలోనే తీపి కబురు అందించనుంది.

English summary

Microsoft company is going launch a new sim in which we can shift to multiple networks.This feature will be available soon in windows phones.To use this feature Microsoft provides a sim card in which we can use our desired network