నేటి నుంచి వన్‌ప్లస్ ఎక్స్ ఓపెన్ సేల్ 

One Plus X Sale Starts Today

05:13 PM ON 10th December, 2015 By Mirchi Vilas

One Plus X Sale Starts Today

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ కి చెందిన ఫోన్ కొనుగోలు చేయాలంటే ఇన్విటేషన్ ఉండాల్సిందే. ఇది పాత కబురు. ఇప్పుడు వన్ ప్లస్ ఎక్స్ ఫోన్ కొనుగోలు చేయాలంటే ఎవరి ఇన్ వైట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. గురువారం నుంచి భారత్‌లో వన్ ప్లస్ ఎక్స్ మొబైల్ అమ్మకాలను మొదటిసారిగా ఓపెన్‌సేల్ ద్వారా నిర్వహిస్తోంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమేజాన్ ద్వారా ఈ ఫోన్‌ని కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వన్ ప్లస్ అక్టోబర్ లో ఈ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. దీని ధర రూ.16,999. ఐదు అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే మొబైల్ అయిన వన్ ప్లస్ ఎక్స్.. 2.3 జిగా హెడ్జ్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 801 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 3 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మెమరీ దీనిని 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 13మెగాపిక్సెల్- వెనుక కెమేరా.. 8మెగా పిక్సెల్- ముందు కెమేరా ఉన్నాయి. డ్యూయల్ సిమ్ సదుపాయంతో పని చేసే ఈ ఫోన్ 4జీని సపోర్ట్ చేస్తుంది. 2525 ఎంఎహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉంది.

English summary

OnePlus X smart phone will be available for sale from today .This phopne is exclusively available on online shopping site Amazon