ఓ ట్వీట్ తో నెరవేరిన 69 ఏళ్ల కల

One Tweeet Brings Post Office To That Village

01:15 PM ON 30th June, 2016 By Mirchi Vilas

One Tweeet Brings Post Office To That Village

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరితే, వచ్చే ఆనందం అంతా ఇంతాకాదు. సరిగ్గా అదే జరిగింది. ఒకటి రెండు కాదు ఏకంగా 69 ఏళ్లకు నిరీక్షణకు ఒక్క ట్వీట్ ఫుల్ స్టాప్ పెట్టింది. ఉత్తరం ముక్క రాసుకునే సౌకర్యం కూడా లేని ఆ గ్రామానికి, ఇన్నాళ్ల తర్వాత ఓ ట్వీట్, నిజంగా ఒకే ఒక్క ట్వీట్ ద్వారా, ఆ కల నెరవేరింది. ఎలా సాధ్యమై ఉంటుంది..? ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి సమాచార విప్లవం పరుగులు పెడుతున్న నేటి తరుణంలోను.. ఇప్పటికీ పోస్ట్ ఆఫీస్ లాంటి కనీస సమాచార కేంద్రాలు లేని ఊళ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. భారత్-చైనా సరిహద్దుకు 120 కిమీల దూరంలో ఉత్తరాఖండ్ లోని పితోరాగఢ్ జిల్లాలో ఉన్న భరోలి అనే ఊరు కూడా ఇదే కోవలోకి వస్తుంది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 ఏళ్లవతున్నా.. కనీస సమాచార వ్యవస్థగా భావించే పోస్ట్ ఆఫీస్ కూడా ఆ ఊళ్లో లేకపోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ వస్తోంది. పోస్ట్ ఆఫీస్ కూడా లేని ఆ ఊరికి బయట ప్రపంచంతో సంబంధాలు తక్కువ. పోస్ట్ ఆఫీస్ లేకపోవడం వల్ల సమాచారంలో జాప్యంతో ఆ ఊళ్లో ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులు కూడా చాలామందే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఈ పరిస్థితికి ఫుల్ స్టాప్ పడి ఇప్పడు భనోలిలో ఓ తపాలా కార్యాలయం ఏర్పాటైంది. అది ఓ ట్వీట్ వల్లనే. అదీ సంగతి.

English summary

One Tweet Brings Post Office to that village in Uttarakhand. there were no post office even in that village upto now.