శ్రీమంతుడికి వన్ ఇయర్ సంబరం!

One year for Srimanthudu movie

10:54 AM ON 8th August, 2016 By Mirchi Vilas

One year for Srimanthudu movie

ఈ మధ్య మూవీలకు సంబంధించి విడుదలై ఏడాది అయిన సందర్భంగా కూడా ట్వీట్ లు చేస్తూ తమ సొంతోషాన్ని పంచుకుంటున్నారు. ఇదే కోవలో ఇటీవల బాహుబలి వన్ ఇయర్ సందడి చూసాం. ఇప్పుడు శ్రీమంతుడు వంతు అయింది. ఈ చిత్రం విడుదలై ఆగస్టు 7కు ఏడాది అయిన సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మూవీ యూనిట్ తో సంతోషం పంచుకున్నాడు. ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఈ సూపర్ స్టార్ ప్రాజెక్ట్ శరవేగంగా తెరకెక్కుతోన్న నేపథ్యంలో, 2015లో ఈ మూవీ రెండో అతిపెద్ద హిట్ సినిమాగా టాక్ తెచ్చుకున్న శ్రీమంతుడు గురించి సూపర్ స్టార్ ప్రస్తావించాడు.

ఈ మూవీ అవార్డులనూ సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీమ్ తో కలిసి పని చేసిన అనుభవాలను గుర్తు చేసుకుని మహేష్ పొంగిపోయాడు. మళ్ళీ ఇలాంటి యూనిట్ తో పని చేయాలన్న ఆకాంక్షను తన ట్విట్టర్ లో వ్యక్తం చేస్తూ, ఛీర్స్ టు శ్రీమంతుడు టీమ్ అని ట్వీట్ చేశాడు.

English summary

One year for Srimanthudu movie