జుట్టు ఊడిపోతోందా.. అయితే ఉల్లి రసం పరిష్కారం

Onion is the best medicine for hair loss

11:55 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Onion is the best medicine for hair loss

ప్రస్తుత కాలంలో అందంగా ఉండడం కోసం, అందంగా కనిపించడం కోసం చాలామంది వివిధ రకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. ఈ విషయంలో స్త్రీ, పురుష బేధం లేదు. అయితే అందం విషయానికి వస్తే ముఖంతోపాటు ప్రధానంగా చెప్పుకోదగినవి శిరోజాలు. శిరోజాలు కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటేనే ఎవరైనా ఇట్టే ఆకర్షింపబడతారు. ఈ క్రమంలో ఒత్తైన జుట్టు కోసం ఉల్లిపాయ రసం బాగా పనిచేస్తుందని అంటున్నారు. ఈ చిట్కాలను కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా పాటింవచ్చు. దీంతో చక్కని శిరోజాలు వారి సొంతమవుతాయి.

ఉల్లిపాయ రసంతో వెంట్రుకలకు పోషణను ఎలా అందించవచ్చో ఓ సారి పరిశీలిద్దాం.

1/4 Pages

1. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ అనే మూలకం జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. అందుకే కొన్ని ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఆ పేస్ట్ను తల కుదుళ్లకు తగిలేలా రాయాలి. తరచూ ఇలా చేస్తుంటే తలపై ఊడిపోయిన వెంట్రుకలు మళ్లీ పెరుగుతాయి. అంతేకాదు వెంట్రుకలు దృఢంగా, ఒత్తుగా ఉంటాయి.

English summary

Onion is the best medicine for hair loss