ఉల్లి చేసే మేలు !!

Onion juice helps in hair growth

04:10 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Onion juice helps in hair growth

చాలా మంది జుట్టు రాలిపోతుందని చాలాబాధ పడుతూ ఉంటారు. రోజుకి 50 నుండి 100 వరకు వెంట్రుకలు రాలిపోవడాన్ని పరిగణలోకి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో సాధారణంగా 50-100 వరకు వెంట్రుకలు రాలడం సహజం. వత్తిడి వలన జుట్టు రాలడం జరుగుతుంది. అందువల్ల ఎప్పుడూ వత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. జుట్టు రాలే సమస్యను అరికట్టడానికి ఒక అద్బుతమైన చిట్కా ఉల్లిపాయ. ఉల్లిపాయ సహజసిద్ధమైనది కనుక దీనిని వాడడం వలన ఎటువంటి సైడ్స్‌ఎపెక్ట్స్‌ కలుగవు. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి జుట్టుని వత్తుగా పెరిగేలా చేస్తుంది. చుండ్రు సమస్యతో బాదపడేవారు కూడా ఉల్లిపాయను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.

ఉపయోగించే విధానాలు:

1. ఉల్లిరసం, తేనె

 • పావు కప్పు ఉల్లిపాయ రసాన్ని తీసుకొని ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె కలపాలి.
 • ఈ మిశ్రమాన్ని తలకి బాగా పట్టించి 15 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి.
 • ఇలా చేయడం వలన మంచి ఫలితం పొందుతారు.

2. ఉల్లిపాయలు

ఉల్లిపాయలు రోజు వంటకాలలో వాడడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదు అనే సూక్తి అందరికీ తెలిసిందే. అందువల్ల ఉల్లిపాయని రోజు ఏదో రూపంలో సేవించడం మంచిది.

3. ఉల్లి రసం

ఉల్లిరసంతో తలని కడగడం వలన జుట్టు వత్తుగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇది వాడడం వలన ఎటువంటి మంట, ఇరిటేషన్‌ కలుగవు.

 • 4 లేదా 5 ఉల్లిపాయలను ముక్కలుగా కోసుకోవాలి.
 • ఈ ముక్కలని ఒక లీటర్‌ నీటిలో వేసి బాగా మరగనివ్వాలి.
 • మరిగిన నీటిని చల్లారనిచ్చి తరువాత ఆ నీటితో తలను కడగాలి.
 • తరువాత ఎప్పుడూ చేసేవిధంగా షాంపూతో తలకి స్నానం చేయాలి.
 • ఒక వేళ జుట్టు వాసన వచ్చినా ఇబ్బంది లేదు అనుకునే వారు నీటితో తలని కడిగి మరుసటి రోజు షాంపూతో చేయాలి.

4. ఉల్లిపాయ రసం మరియు రమ్‌

ఉల్లిపాయ వాసన అంటే ఎవరికీ నచ్చదు. కాని జుట్టు రాలడాన్ని అరికట్టాలి అనుకునేవారు ఉల్లిపాయని తప్పకుండా వాడాల్సిందే. ఇది జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

 • ఉల్లిపాయ ముక్కలు తీసుకొని ఒక గ్లాసు రమ్‌లో రాత్రంతా నాన పెట్టాలి.
 • మరుసటిరోజు గ్లాసు నుండి ఉల్లిపాయముక్కలని తీసివేసి మిగిలిన రసాన్ని ఉపయోగించి తలను మసాజ్‌ చేసుకోవాలి.
 • ఇలా కొంత సమయం చేసిన తరువాత తలను బాగా శుభ్రపరుచుకోవాలి.

ఉల్లిపాయను వాడి జుట్టు రాలడాన్ని అరికట్టడం ఎలాగో చూసారుకదా. ఇంట్లో అందరికి లభించే సుభమైన పదార్ధం ఉల్లిపాయ దీనిని వాడి మీరే అద్బుతాన్ని గమనించండి.ఇది వాడడం వలన జుట్టు ప్రకాశవంతంగా మృదువుగానూ మారుతుంది. తలలో ఏమైనా చర్మ సమస్యలు ఉన్నా వాటిని అరికడుతుంది.

English summary

Onion juice helps in hair growth. Many people face the problem of hair loss. Through losing 50-100 hairs per day is consider as normal, losing hair cause concern and mental stress in people.