'అమ్మోరి'కి ఆన్ లైన్ లో కూడా పూజలు!

Online pooja for Ammoru

01:01 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Online pooja for Ammoru

గణపతి నవరాత్రులు ముగియడంతో ఇక దేవీ నవరాత్రులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1నుంచి శరన్నవరాత్రి సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో పూజలు అందుబాటులో లేని వాళ్ళకోసం, ముఖ్యంగా ఎన్ఆర్ఐ ల కోసం ఓ సంస్థ ఆన్ లైన్ పూజలకు రంగం సిద్ధం చేస్తోంది. సమస్త విశ్వంలో దైవం లేని చోటు లేదు. ఈ సకల చరాచర జగత్తు పరమాత్మ నుంచే రూపు దిద్దుకుంది. ఎవరు.. ఎలా.. ఎక్కడ.. ఏ మార్గం ద్వారానైనా ఆ ఆది మధ్యాంత రహితుడిని పూజించినా కలిగే ఫలితం ఒక్కటే అనే వచనాలను ఆదర్శంగా తీసుకుందో ఏమో గానీ, అంకుర సంస్థ ఆన్ లైన్ లో పూజలు చేయిస్తానంటోంది. ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే చాలు.

మీరు విదేశాల్లో ఉన్నా, స్వదేశంలో ఉన్నా పండితులతో అన్ని హోమాలు, వ్రతాలు సహా ఈ నవరాత్రికి దుర్గా మాత పూజలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయిస్తామంటోంది poojashoppe.com సంస్థ. ఝార్ఖండ్ కు చెందిన తపస్ మల్లిక్ ఈ సంస్థను ప్రారంభించారు. అన్నిరకాల పూజలు చేసే పండితులు అన్ని చోట్లా దొరకడం లేదన్న తమ ఎన్ఆరై మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆయన పూజాషాపీని స్థాపించారు. విదేశాల్లో ఉన్న వారు రెండు రోజుల ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటే ఏ పూజనైనా సరే ఆన్ లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిస్తామని ఆయన చెబుతున్నారు. గతంలో గయలో ఆన్ లైన్ ద్వారా పిండ ప్రదానం చేశారు. అయితే ఇలాంటి సౌకర్యం జార్ఖండ్ లో లేదు.

వెబ్ సైట్ ఓపెన్ చేసి కావాల్సిన పూజను ఎంపిక చేసుకుంటే చాలు. తమ వద్ద 10 వేలమంది పండితులు ఉన్నారని, అన్ని రకాల పూజలు చేస్తారని ఆయన చెబుతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒకేసారి వంద రకాల వేర్వేరు పూజలు చేయించే సౌలభ్యం తమకుందని కూడా ఆయన వివరించారు. అయితే పూజను బట్టి రూ.550 నుంచి రూ.21 వేల వరకు వసూలు చేస్తారు.

ఇది కూడా చదవండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చదవండి: నెట్ లో హల్ చల్ చేస్తున్న మెగాస్టార్ మనువరాలు హాట్ ఫొటోస్

ఇది కూడా చదవండి: బ్లడ్ గ్రూప్ తెలిస్తే మీ మనస్తత్వతం ఇట్టే చెప్పేయొచ్చు

English summary

Online pooja for Ammoru